News July 5, 2025
‘విశాఖలో టూరిజం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం’

విశాఖను అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. సన్ క్యాంపస్‌లోని విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. త్వరలోనే టూరిజం యూనివర్సిటీని విశాఖలో నెలకొల్పేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. పర్యాటక రంగంలో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సన్ CMD శ్రీకాంత్ జాస్తి పాల్గొన్నారు.
Similar News
News July 5, 2025
NLG: వన మహోత్సవానికి సిద్ధం

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది పెద్దఎత్తున మొక్కలు నాటేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో నర్సరీలు, మొక్కలు నాటే ప్లాంటేషన్ సైట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 68.70 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
News July 5, 2025
సంగారెడ్డి: హెక్టార్‌లో 2 టన్నుల కంది దిగుబడి

గరిష్ట ఉష్ణోగ్రతలు తట్టుకొని, ఒక హెక్టార్‌లో 2 టన్నులు దిగుబడి ఇచ్చే కంది వంగడాన్ని ICPV 25444 పేరుతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 45 డిగ్రీల సెల్సియ ఉష్ణోగ్రతల వద్ద సైతం ఇది తట్టుకుంటుంది. 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఖరీఫ్ రబీ సీజన్‌లో ఎప్పుడైనా పంట పండించవచ్చు. తాండూరు, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాలు ఈ పంట రకానికి అనుకూలమని అధికారులు డైరెక్టర్ హిమాన్షు తెలిపారు.
News July 5, 2025
ఒంటరితనం.. ఒకరికొకరు పలకరించుకుంటే మేలు!

బంధాలు, బంధుత్వాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కుటుంబాల్లో, స్నేహితుల్లో ప్రేమానురాగాలు ఉండేవి. ప్రస్తుతం సంపాదనలో పడి ఒకరి గురించి మరొకరు ఆలోచించడమే మానేశారు. దీంతో ఎంతో మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. దీని వల్ల ప్రతి గంటకు వంద మంది చనిపోతున్నట్లు WHO చెబుతోంది. ఇండియాలో యువత సామాజిక సంబంధాలకు దూరంగా స్క్రీన్‌కు దగ్గరగా ఉంటూ మానసిక, శారీరక సమస్యలు తెచ్చుకుంటోందని పేర్కొంది.