News March 18, 2024

విశాఖలో ‘టైగర్‌ ట్రయాంఫ్‌–2024’ విన్యాసాలు

image

భారత్, యూఎస్‌ మధ్య రక్షణ బంధం బలోపేతానికి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖలో టైగర్‌ ట్రయాంఫ్‌–2024 సోమవారం ప్రారంభమైంది. ఈ నెల 31 వరకూ రెండు ఫేజ్‌లలో విన్యాసాలు జరగనున్నాయి. యూఎస్‌కు చెందిన యూఎస్‌ఎస్‌ సోమర్‌సెట్‌ యుద్ధ నౌకతో పాటు ల్యాండింగ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, హెలికాఫ్టర్లు, యూఎస్‌ మెరైన్‌ కార్ప్స్, ఎమ్మార్కెడ్‌ దళాలు విశాఖకు చేరుకున్నాయి.

Similar News

News July 8, 2024

విశాఖ ఐఐఎంలో ఎగ్జిక్యూటివ్ పీహెచ్డీ ప్రోగ్రాం ప్రారంభం

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ పీహెచ్డీ మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. గంభీరంలోని ఐఐఎం క్యాంపస్లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐఐఎం సంచాలకులు ఆచార్య ఎం.చంద్రశేఖర్ హాజరయ్యారు. విభిన్న రంగాల్లో అపార అనుభవం కలిగిన నిపుణులకు పీహెచ్డీలో ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ విభాగం డీన్ కావేరి కృష్ణన్, రీసెర్చ్ డీన్ అమిత్ శంకర్ పాల్గొన్నారు.

News July 8, 2024

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డల్లాస్‌లో నిరసనలు

image

అమెరికాలోని డల్లాస్‌లో థామస్ జేఫర్ సన్ పార్కులో ప్రవాసాంధ్రులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. సెయిల్ ‌లో స్టీల్ ప్లాంట్ ‌ను విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలన్నారు. విశాఖ ఉక్కు తెలుగు వారి గండె చప్పుడుగా పేర్కొన్నారు.

News July 8, 2024

రుషికొండ భవనాల వాడుక నీరు శుద్ధికి రూ.2.5 కోట్లు..!

image

రుషి కొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాల నుంచి వచ్చే వాడుక నీటిని శుద్ధి చేసేందుకు భారీ వ్యయంతో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నిర్మించారు. దీనిని నిర్మించినందుకు రూ.2.50 కోట్లు ఖర్చు చేశారు. దీనిని బీచ్ రోడ్డులోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం పక్కన నిర్మించారు. ఇందుకోసం అర కిలోమీటర్ మేర భూగర్భంలో పైపులైన్లను ఏర్పాటు చేశారు. అత్యంత విలువైన వీధి దీపాలను కూడా ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.