News January 8, 2025

విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు

image

ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 12 గంటలకు నగరానికి చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు ఐఎన్ఎస్ డేగాలో సీఎం చంద్రబాబుతో కలిసి ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం 4.45గంటలకు ప్రధాని, సీఎంతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. ఆ తర్వాత ఏయూలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

Similar News

News September 16, 2025

విశాఖ: వృద్ధురాలిని మోసం చేసిన కేసులో ముగ్గురి అరెస్టు

image

వృద్ధురాలి డబ్బులు దోచేసిన ముగ్గురిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాగర్ నగర్‌లో ఉంటున్న వృద్ధురాలికి ఈ ఏడాది మే 16న ఫోన్ చేసి బంధువులుగా పరిచయం చేసుకున్నారు. ఆమె నుంచి ధఫదపాలుగా రూ.4 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. డబ్బలు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బ్యాంక్ ఖాతాల ఆధారంగా రాజస్థాన్‌కి చెందిన మొయినుద్దీన్, గణేశ్, దినేశ్‌‌ను పట్టుకున్నారు.

News September 16, 2025

నేటి నుంచి జీవీఎంసీ కార్పొరేటర్ల అధ్యయన యాత్ర

image

జీవీఎంసీ కార్పొరేటర్లు మంగళవారం అధ్యయన యాత్రలో పాల్గొననున్నరు. ఈ ప్రయాణంలో భాగంగా రేపు జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించనున్నారు. అనంతరం ఆజ్మీర్, జోద్‌పూర్ నగరాల్లో పర్యటించి పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తారు. కార్పొరేటర్ల బృందం ఈనెల 24న తిరిగి విశాఖకి చేరుకుంటుంది.

News September 16, 2025

విశాఖ: 19న జాబ్ మేళా

image

కంచరపాలెం నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ (ఎన్‌సీఎస్‌సీ)లో ఈనెల 19న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ ఉపాధి కల్పనాధికారి శ్యాం సుందర్ తెలిపారు. బీపీవో, రిలేషిప్ మేనేజర్, టెలీకాలింగ్ ఆపరేటర్‌ విభాగాల్లో సుమారు 100 ఉద్యోగాలకు డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ పాస్ అయిన నిరుద్యోగులు అర్హులుగా పేర్కొన్నారు. 19న ఉదయం 10 గంటలకు తమ సర్టిఫికెట్స్‌తో హాజరుకావాలని కోరారు.