News November 13, 2024
విశాఖలో డ్రగ్స్ కంటైనర్స్‌పై మరోసారి చర్చ
విశాఖలో డ్రగ్స్ కంటైనర్‌ను CBI సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై MLC బొత్స కేంద్ర హోంమంత్రికి మంగళవారం లేఖ రాశారు. ‘సంధ్యా ఆక్వా సంస్థ పేరు మీద బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ కంటైనర్‌ను CBI సీజ్ చేసింది. ఆక్వా యాజమాన్యానికి పురందీశ్వరికి సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. దర్యాప్తు వివరాలు బహిర్గతం కాలేదు. వాస్తవాలను పబ్లిక్ డొమైన్‌లో వెల్లడించాలని CBIకి ఆదేశాలు జారీ చేయండి’ అని పేర్కొన్నారు.
Similar News
News November 14, 2024
విశాఖలో కబ్జాలను ఆధారాలతో నిరూపిస్తా: బండారు
విశాఖలో పెద్ద ఎత్తున భూకబ్జాలు జరిగాయని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అసెంబ్లీలో ప్రస్తావించారు. సుమారు రూ.3వేల కోట్లు విలువ చేసే 300 ఎకరాల భూమిని వైసీపీ హయాంలో ప్రజలను భయపెట్టి లాక్కున్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి హస్తం ఇందులో ఉందని తనకు అవకాశం ఇస్తే పూర్తి ఆధారాలతో నిరూపిస్తా అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపట్టాలని బండారు కోరారు.
News November 14, 2024
విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లకు అదనపు భోగిలు
ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం మీదుగా నడిచే పలు రైళ్లకు అదనపు బోగీలను జత చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ కార్యాలయ అధికారులు తెలిపారు. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18463/64), భువనేశ్వర్-తిరుపతి-భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ (22879 /80)నకు రెండు థర్డ్ ఏసీ భోగిలు, అలాగే ఏపీ ఎక్స్‌ప్రెస్, విశాఖ-దిఘా, గాంధిగామ్ సూపర్ ఫాస్ట్‌లకు అదనపు భోగిలు జత చేశామని తెలిపారు.
News November 14, 2024
నేటి నుంచి ఇంటింటికి సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభం
విశాఖలో నేటి నుంచి ఇంటింటికి వైద్య సిబ్బంది వచ్చి కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని డిఎంహెచ్ఓ జగదీశ్ అన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో కాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంపై వైద్య సిబ్బందితో అవగాహనా శిబిరం నిర్వహించారు.18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ పరీక్షలు చేసి అవసరమగు వారికీ వైద్యం అందిస్తారని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించికోవాలన్నారు.