News November 30, 2025
విశాఖలో దారుణం

విశాఖలోని శివాజీపాలెం చిన్నపోలమాంబ గుడి వద్ద పసికందు మృతదేహం వెలుగు చూసింది. గుడి ఎదురుగా ఉన్న వీధిలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఏ సమయంలో ఇక్కడ పెట్టేశారో తెలియదు కానీ స్థానికంగా కలకలం రేగింది. ఎంవీపీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పసికందుని ఆసుపత్రికి తరలించారు. ఎవరు పడేశారో గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
Similar News
News April 5, 2026
నిర్మల్: 15 గ్రామాల్లో ఐస్ క్రీమ్ నిషేధం

నిర్మల్ జిల్లాలో ఐస్ క్రీమ్ నిషేధంపై గ్రామ పంచాయతీలు ఏకమవుతున్నాయి. హానికర రంగులు, రసాయనాలతో తయారుచేసే లోకల్ ఐస్ క్రీమ్‌లతో చిన్న పిల్లల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని, అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు. దీంతో ఏకంగా 15 గ్రామాల్లో ఐస్ క్రీమ్ వాహనాలకు నో ఎంట్రీ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
News April 5, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో రేపు పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 5, 2026
SRH బ్యాటింగ్.. జట్టులో మార్పు

SRHతో మ్యాచులో LSG టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సలీల్ స్థానంలో లివింగ్‌స్టోన్, పైన్ స్థానంలో హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చారు.
SRH: అభిషేక్, హెడ్, కిషన్ (C), క్లాసెన్, అనికేత్, నితీశ్, లివింగ్‌స్టోన్, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, ఉనద్కత్, శివాంగ్ కుమార్.
LSG: మార్ష్, పంత్ (C), మార్క్రమ్, పూరన్, సమద్, ముకుల్ చౌదరి, సిద్దార్థ్, అవేశ్ ఖాన్, షమీ, దిగ్వేశ్, ప్రిన్స్.


