News February 23, 2025

విశాఖలో నకిలీ పోలీస్ అరెస్ట్

image

విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పోలీస్‌ను ఎయిర్ పోర్ట్ సీఐ ఉమామహేశ్వరరావు శనివారం అరెస్ట్ చేశారు. NAD, శాంతినగర్ పార్క్ ఏరియాలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరానికి చెందిన నిందుతుడు బోను దుర్గారావును అరెస్ట్ చేశారు. రెండు నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, బెదిరించి దోచుకున్న స్కూటీ‌తో పాటు ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News February 23, 2025

విశాఖలో పగడ్బందీగా గ్రూప్-2 పరీక్ష: కలెక్టర్

image

విశాఖ జిల్లాలోని 16 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష ఆదివారం ప్రారంభమైంది. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల పరిధిలోని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మొదటి సెషన్స్‌లో 11,030 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. 9,293 మంది పరీక్షకు హాజరయ్యారు. 1,638 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రంలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

News February 23, 2025

గాజువాకలో యువకుడు సూసైడ్?

image

గాజువాక సమీపంలో గల అక్కిరెడ్డిపాలెంకు చెందిన ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు ఆదివారం ఉదయం గుర్తించారు. విశాఖ డైరీ సర్వీస్ రోడ్డులోని శ్రావణి షిప్పింగ్ భవనం పక్కనే చెట్టుకు మృతదేహం వేలాడుతూ ఉంది. ఫ్రూట్ షాప్‌లో పనిచేస్తున మృతుడు కర్రీ ప్రవీణ్‌(27)గా గుర్తించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 23, 2025

విశాఖ: యాక్సిడెంట్‌లో భర్త మృతి.. భార్యకు గాయాలు

image

ఆనందపురం మండలంలోని గిడిజాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా.. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. పొడుగుపాలెంకి చెందిన బంటుబిల్లి లక్ష్మణరావు(35), గౌరీ బైక్‌పై వేమగొట్టిపాలెం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా లక్ష్మణరావు మార్గమధ్యలో మృతి చెందాడు. అతని భార్య గౌరీకి రెండు కాళ్లు విరిగిపోయాయి. 

error: Content is protected !!