News December 10, 2025

విశాఖలో నేటి నుంచి ఎక్కడికక్కడ పనులు బంద్

image

జీవీఎంసీ పరిధిలో కాంట్రాక్టర్లు బుధవారం నుంచి పనులు నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నారు.18 నెలలు నుంచి కాంట్రాక్టర్లకు రూ.400 కోట్ల బకాయిలు ఉండగా బిల్లులు చెల్లించాలని పలు దఫాలుగా వినతులు ఇచ్చారు. మంగళవారం కమిషనర్‌కు నోటీసులు కూడా అందజేశారు. స్పందించకపోవడంతో నేటి నుంచి యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోనూ కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు.

Similar News

News February 19, 2026

టెక్నాలజీతో నిఘా.. ‘అస్త్రం’ యాప్‌తో ట్రాఫిక్ నియంత్రణ

image

విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ బందోబస్తును పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి స్వయంగా పర్యవేక్షించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, ‘అస్త్రం’ & ‘ఈ-పాత్’ యాప్‌ల సాయంతో భద్రతను పగడ్బందీగా నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేడుకను విజయవంతం చేసిన సిబ్బందిని సిపీ అభినందించారు. పోలీసులకు సహకరించిన నగర ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

News February 19, 2026

విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

image

విశాఖలో జరుగుతున్న ఐఎఫ్ఆర్ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం విశాఖ వచ్చారు. ఆయనకు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పలువురు నేవీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖలో ఐఎఫ్ఆర్ వేడుకల్లో పాల్గొని సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.

News February 19, 2026

ఎంవీపీ: ప్లాస్టిక్ కవర్ల వాడకం.. రూ.1000 జరిమానా

image

జీవీఎంసీ అదనపు కమిషనర్ నల్లనయ్య గురువారం 18వ వార్డులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తున్న రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ షాపుల యజమానులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక్కొక్కరికి రూ. 1000 జరిమానా విధించారు. ప్లాస్టిక్ రహిత నగరమే లక్ష్యమని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.