News March 3, 2025

విశాఖలో నేటి నుంచి పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు

image

నేటి నుంచి ఈనెల 13వ తేది వరకు పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గంట ముందు మండల విద్యాశాఖ కార్యాలయం నుంచి ప్రశ్న పత్రాలు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4:45 వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులకు పరీక్షలపై భయం పోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని అన్నారు.

Similar News

News March 3, 2025

విశాఖ: ఒకే వేధికపై చంద్రబాబు, దగ్గుపాటి

image

సీఎం చంద్రబాబు ఈనెల 6న విశాఖ రానున్నారు. ఓ ప్రైవేట్ యూనివర్శిటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందీశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పాల్గొంటారు. సుదీర్ఘకాలం తర్వాత తోడల్లుళ్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకే వేదికపై కనిపించనున్నారు.

News March 3, 2025

వాట్సాప్‌ ద్వారా పదో తరగతి హాల్ టికెట్లు: విశాఖ డీఈవో

image

పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు మార్చి 3వ తేదీ మధ్యాహ్నం విడుదల చేసినట్లు విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్‌లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. 9552300009 నంబర్‌కు హాయ్ అని పంపిస్తే దాని ద్వారా వాట్సాప్ సేవలు > విద్యా సేవలు > SSC హాల్ టికెట్ > అప్లికేషన్ నంబర్ > చైల్డ్ ఐడీ, పుట్టిన తేదీ > స్ట్రీమ్ > కన్ఫర్మ్ కొట్టి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.

News March 3, 2025

పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

image

విశాఖలో ఇంటర్ సెకెండ్ ఇయర్‌ పరీక్షల నిర్వహణను జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ సోమవారం తనిఖీ చేశారు. విశాఖ ఉమెన్స్ జూనియర్ కాలేజీ, ఎసెంట్ జూనియర్ కాలేజీలలో పరీక్షా కేంద్రాలను ఆయన సందర్శించి పరీక్షల నిర్వహణ పరిశీలించారు. మొత్తం 38,879 మంది విద్యార్థులకు 38,478 మంది హాజరు కాగా 401 మంది గైర్హాజరయ్యారు.

error: Content is protected !!