News January 27, 2025
విశాఖలో పర్యాటకశాఖ పెట్టుబడుల సదస్సు
విశాఖలోని నోవాటెల్ హోటల్‌లో పర్యాటక పెట్టుబడిదారుల ప్రాంతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ బాలాజీ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు. ఈ సదస్సులో వ్యాపారవేత్తలతో టూరిజంలో పెట్టుబడులపై చర్చించనున్నారు.
Similar News
News January 28, 2025
పద్మనాభం: రెండు కుంటుబాల్లో తీవ్ర విషాదం
పద్మనాభం మండలం కృష్టాపురంలో ఒకే రోజు <<15283151>>ఇద్దరు సూసైడ్<<>> చేసుకున్న ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వివాహిత కనకల లక్ష్మి(30) మరణంతో ఆమె ఇద్దరు కుమారులు తల్లి లేనివారయ్యారు. ఒక్కగానొక్క కొడుకు మొరక ఆదిత్య(22) ఇంక లేడన్న వార్తను అతని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆటల్లో చురుగ్గా ఉండే ఆదిత్య తండ్రి వైద్యారోగ్యశాఖలో చిరుద్యోగి కాగా.. లక్ష్మి భర్త లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
News January 28, 2025
విశాఖలో నారా లోకేశ్‌కు అర్జీలు
విశాఖ టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. కసింకోట నుంచి తన మూడేళ్ల కుమార్తె అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆర్థికసాయం అందించాలని కోరారు. వృద్ధాప్య పెన్షన్ ను తొలగించారని విశాఖ సీతంపేటకు చెందిన అవ్వ కాంతం విజ్ఞప్తి చేశారు. తన తండ్రి సంపాదించిన భూమి ఆక్రమించారని విజయనగరం జిల్లా అంగటి లక్ష్మి ఫిర్యాదు చేసారు. అర్జీల పట్ల చర్యలు తీసుకుంటానని లోకేశ్ హామీ ఇచ్చారు.
News January 28, 2025
విశాఖ: ‘అందుబాటు ధరల్లో స్థలాలు’
ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్”లో స్థలాలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఉన్నాయని వి.ఎం.ఆర్.డి.ఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. విశాఖ జిల్లా రామవరం, పాలవలస, గంగసాని అగ్రహారం, అనకాపల్లి జిల్లా అడ్డూరు, విజయనగరం జిల్లా గరివిడి ప్రాంతాలలో అన్ని మౌలిక వసతులతో లభ్యమవుతున్నాయన్నారు. అనాధికారిక లేఔట్లలో స్థలాలు కొని మోసపోవద్దని సూచించారు.