News January 6, 2025

విశాఖలో ప్రధాని పర్యటన.. డ్రోన్ కెమెరాలపై ఆంక్షలు

image

పీఎం నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి డ్రోన్ కెమెరాలపై ఆంక్షలు విధించారు. నగరంలో ప్రధాని రోడ్ షో, బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో డ్రోన్ కెమెరాలు కలిగి ఉన్న వారు ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్, ప్రధాని పర్యటించే పరిసర ప్రాంతాలలో 5 కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాలు వినియోగం నిషేధమన్నారు. నిషేదాజ్ఞలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులకు శిక్షార్హులు అవుతారన్నారు.

Similar News

News January 8, 2025

విశాఖ: 600 బస్సుల్లో జనాల తరలింపు

image

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో బుధవారం నిర్వహించే బహిరంగ సభకు ప్రజలను తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ 600 బస్సులను వినియోగిస్తుంది. విశాఖ నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సుల ద్వారా ప్రజలను తరలించనున్నారు. అలాగే దూర ప్రాంతాలకు 60 బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో నేడు ఆర్టీసీ సిటీ, మెట్రో సర్వీసులు దాదాపు నిలిచిపోనున్నాయి.

News January 7, 2025

ప్రధాని సభా ప్రాంతం పరిశీలించిన ఎంపీ శ్రీ భరత్

image

విశాఖలో ప్రధాని మోదీ పర్యటన పనులను మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి విశాఖ ఎంపీ శ్రీ భరత్ పరిశీలించారు. రోడ్డు, ప్రధాని సభ, గ్యాలరీ, బారికేడ్లు, పనులను పరిశీలించారు. దూర ప్రాంతాల నుంచి ప్రధానిని చూడటానికి వస్తున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లను మరింత బాగా చేయాలని అధికారులను ఆదేశించారు.

News January 7, 2025

ప్రధానమంత్రి రోడ్ షోకు ప్రచార రథం సిద్ధం..!

image

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విశాఖలో నిర్వహించిన రోడ్‌ షోకు ప్రచార రథాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. వెంకటాద్రి వంటిల్లు ప్రాంతం నుంచి ఏయూ మైదానం వరకు ప్రధాని ఈ రథంపై రోడ్‌ షో నిర్వహించనున్నారు. ప్రధానంగా మోదీ బొమ్మ మధ్యన ఉంటూ ఇరువైపులా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది