News January 7, 2025

విశాఖలో ప్రధాని పర్యటన.. డ్రోన్ కెమెరాలపై ఆంక్షలు

image

పీఎం నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి డ్రోన్ కెమెరాలపై ఆంక్షలు విధించారు. నగరంలో ప్రధాని రోడ్ షో, బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో డ్రోన్ కెమెరాలు కలిగి ఉన్న వారు ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్స్, ప్రధాని పర్యటించే పరిసర ప్రాంతాలలో 5 కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాలు వినియోగం నిషేధమని తెలిపారు. నిషేదాజ్ఞలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులకు శిక్షార్హులు అవుతారన్నారు.

Similar News

News January 8, 2025

విశాఖలో నేడు స్కూల్స్‌కు సెలవు

image

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విశాఖ వస్తున్న నేపథ్యంలో జిల్లా పరిధిలోని అన్ని స్కూల్స్‌కు నేడు సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈవో ప్రేమ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. బస్సుల కొరతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఈవో ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మండల విద్యాశాఖ అధికారులతో పాటు పాఠశాలల హెచ్ఎంలకు ఈ విషయాన్ని తెలియజేయాలని డీఈఓ సూచించారు.

News January 8, 2025

స్టీల్ ప్లాంట్‌లో కన్వేయర్లు పునరుద్ధరణ

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సింటర్ ప్లాంట్ విభాగంలో కన్వేయర్లను పునరుద్ధరించారు. సింటర్ ప్లాంట్ విభాగంలో మూడు సింటర్ మిషన్లలో రెండు మిషన్లకు ముడిసరకు సరఫరా చేసే ఏ1, ఏ2 కన్వేయర్ల గ్యాలరీ ఈనెల మూడవ తేదీన కూలిపోయిన విషయం తెలిసిందే. దీని ద్వారా నాలుగు రోజులు పాటు హాట్ మెటల్ ఉత్పత్తి తగ్గింది. మంగళవారం ఉదయం ఏ2 కన్వెయర్, సాయంత్రం ఏ1 కన్వేయర్‌ను ప్రారంభించారు.

News January 8, 2025

విశాఖ: 600 బస్సుల్లో జనాల తరలింపు

image

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో బుధవారం నిర్వహించే బహిరంగ సభకు ప్రజలను తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ 600 బస్సులను వినియోగిస్తుంది. విశాఖ నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సుల ద్వారా ప్రజలను తరలించనున్నారు. అలాగే దూర ప్రాంతాలకు 60 బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో నేడు ఆర్టీసీ సిటీ, మెట్రో సర్వీసులు దాదాపు నిలిచిపోనున్నాయి.