News January 8, 2025
విశాఖలో ప్రధాని సభకు వెళ్తున్నారా?
విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్‌షో, బహిరంగ సభలో పాల్గొనే ప్రజలు తమ వెంట కేవలం సెల్ ఫోన్ మాత్రమే తీసుకురావాలని సూచించారు. మరే ఇతర బ్యాగులు, వస్తువులు తీసుకువచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తెచ్చినట్లయితే తమ వాహనాల్లో భద్రపరుచుకోవాలన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. >Share it
Similar News
News January 9, 2025
ఉత్తరాంధ్రుల చిరకాల కోరిక తీరనుంది: సీఎం
విశాఖ రైల్వే జోన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతో ఉత్తరాంధ్రుల చిరకాల కోరిక తీరనుందని CM చంద్రబాబు పేర్కొన్నారు. రైల్వే జోన్ కోసం 52 ఎకరాలు ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. మరో వైపు అనకాపల్లి జిల్లాలో రెండు భారీ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయని చెప్పారు. అరకు కాఫీని మోదీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసి ఒక బ్రాండ్ తీసుకొచ్చారన్నారు. విశాఖ ఏపీకి ఆర్థిక రాజధానిగా ఎదుగుతుందని CM చెప్పుకొచ్చారు.
News January 8, 2025
విశాఖ హిస్టరీలో మోదీయే తొలి ప్రధాని..!
విశాఖ మహానగరంలో ప్రధాన మంత్రి హోదాలో రోడ్ షో నిర్వహించనున్న మొదటి వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవనున్నారు. గతంలో ప్రధాని హోదాలో విశాఖ వచ్చిన ఇందిరా గాంధీ, విశ్వనాథ ప్రతాప్‌సింగ్, పీవీ నరసింహారావు బహిరంగ సభలకు మాత్రమే పరిమితమయ్యారు. కాగా మోదీ తొలిసారిగా నగరంలో రోడ్ షో నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందనున్నారు. దీంతోపాటు రూ.2లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టనున్నారు.
News January 8, 2025
36 గంటల దీక్ష.. చలిలోనే నిద్రించిన కార్మికులు
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వం రంగంలోనే కొనసాగించాలని 36 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టిన కార్మికులు మంగళవారం రాత్రి చలిలో శిబిరంలోనే పడుకున్నారు. బుధవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని దీక్షలో కూర్చున్నారు. 36 గంటల నిరాహార దీక్షను వీరు మంగళవారం ఉదయం కూర్మన్నపాలెంలో ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని కోరారు. బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.