News October 15, 2025

విశాఖలో “బచ్చత్ ఉత్సవ్” షాపింగ్ ఫెస్టివల్

image

విశాఖపట్నం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో అక్టోబర్ 16 నుండి 19 వరకు “ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్” (బచ్చత్ ఉత్సవ్) ఘనంగా జరగనుంది. ఈ ఫెస్టివల్‌లో ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ స్టాల్స్‌తో సహా 60కి పైగా ప్రదర్శనలు ఉంటాయి. జీఎస్టీ 2.0, సూపర్ సేవింగ్స్‌పై అవగాహన లక్ష్యంగా ఈ మేళాను నిర్వహిస్తున్నారు. స్టాల్స్ ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు తెరిచి ఉంటాయి.

Similar News

News October 15, 2025

పత్తి నాణ్యత బాగుండాలంటే.. ఇలా చేయండి

image

తెలుగు రాష్ట్రాల్లో పత్తి తీతలో రైతులు నిమగ్నమయ్యారు. పత్తి నాణ్యత బాగుంటేనే అధిక ధర వస్తుంది. పంటకు మంచి ధర దక్కాలంటే పత్తి తీయగానే నీడలో మండెలు వేయాలి. దీనివల్ల గింజ బాగా గట్టిపడి, అందులో తేమశాతం తగ్గి పత్తి శుభ్రంగా ఉంటుంది. లేకుంటే గింజలు ముడుచుకుపోయి పత్తి తూకం తగ్గి, నాణ్యత దెబ్బతినే ఛాన్సుంది. పత్తిని నిల్వచేసే సంచులను శుభ్రంగా ఉంచాలి. వాటిలో దుమ్ము, ధూళీ లేకుండా చూస్తే పత్తి రంగు మారదు.

News October 15, 2025

నేటి నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం

image

అతి పెద్ద దేశవాళీ క్రికెట్ సమరం ‘రంజీ ట్రోఫీ 2025-26’ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ 91వ ఎడిషన్‌లో 38 జట్లు తలపడుతున్నాయి. విదర్భ డిఫెండింగ్ ఛాంపియన్‌గా, కేరళ జట్టు రన్నరప్‌గా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచులు జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ ఖేల్ టీవీలో లైవ్ చూడొచ్చు. ఈ సీజన్‌లో మొత్తం 138 మ్యాచులు జరగనున్నాయి. అత్యధికంగా ముంబై జట్టు 42సార్లు రంజీ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలిచింది.

News October 15, 2025

కోడి పిల్లలను షెడ్డులోకి వదిలే ముందు జాగ్రత్తలు

image

కోడి పిల్లలను షెడ్డులోకి వదలడానికి 10 రోజుల ముందే షెడ్డును శుభ్రపరచి, గోడలకు సున్నం వేయించాలి. బ్రూడరు, మేత తొట్లు, నీటి తొట్లను క్లీన్ చేయాలి. వరి పొట్టును 2-3 అంగుళాల మందంలో(లిట్టర్) నేలపై వేసి.. దానిపై పేపరును పరచాలి. కోడి పిల్లల మేత, నీటి తొట్లను బ్రూడరు కింద ఒకదాని తర్వాత ఒకటి అమర్చాలి. బ్రూడరు చుట్టూ 2-3 అడుగుల దూరంలో 18 అంగుళాల ఎత్తుగా అట్టను వృత్తాకారంలో రక్షక దడిగా అమర్చాలి.