News August 29, 2025
విశాఖలో బస్సు ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా..

విశాఖ ఫోర్త్ పోలీస్ స్టేషన్ హైవే వద్ద శుక్రవారం ఉదయం కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదం సాంకేతిక లోపంతో జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. పోలీస్ అధికారులు, ఆర్టీసీ అధికారులతో ఆమె మాట్లాడారు.
Similar News
News August 29, 2025
ఖానాపూర్ నుంచి పాలజ్‌కు ప్రత్యేక బస్సు

ప్రయాణికుల సౌకర్యార్థం ఉదయం 5.30 గంటలకు ఖానాపూర్ నుంచి మహారాష్ట్రలోని పాలజ్(కర్ర గణపతి) దర్శనానికి మెట్పల్లి డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఖానాపూర్‌లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మార్గమధ్యలోని మాటేగావ్‌లోని కోరాడి గణపతి ఆలయ దర్శనం, ఆ తర్వాత పాలజ్ వెళ్తుందన్నారు. రాత్రికి తిరుగు ప్రయాణం అవుతుందని తెలిపారు. ఛార్జీ రూ.620గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
News August 29, 2025
MBNR: కార్మిక చట్టాలను అమలు చేయాలి: సీఐటీయూ

సీఐటీయూ మహబూబ్‌నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఈరోజు ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. ఐటీ హబ్‌లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, సంక్షేమానికి కృషి చేయాలన్నారు. భూములు కోల్పోయిన స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆర్భాటం చేసిన ప్రభుత్వం, యాజమాన్యాలు కుమ్మక్కై స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించలేదన్నారు. ఈ మేరకు కలెక్టర్ ఏవోకు విన్నవించారు.
News August 29, 2025
మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి డీఅడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్, చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి మాదకద్రవ్యాల సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ సతీష్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.