News December 24, 2024
విశాఖలో బ్యాంక్‌కు బురిడీ
విశాఖలోని సీతంపేట CSB బ్యాంకుకు తమరాన చిరంజీవి అనే వ్యక్తి బురిడీ కొట్టించాడు. CSB బ్యాంకుకి వెళ్లి సుజాతనగర్ FEDERAL బ్యాంకులో గోల్డ్ తాకట్టు ఉందని.. అది విడిపించి మీ బ్యాంక్‌లో పెడతానని రూ.14,69,000 ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. ఆ డబ్బులతో వ్యక్తి పరారయ్యాడు. ఈ ఘటనపై ద్వారకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.
Similar News
News December 24, 2024
సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ ఆధారంగా జీతాలు
అల్లూరి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు జనవరి 1 నుంచి బయోమెట్రిక్ హాజరుతో జీతాల చెల్లింపు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. హాజరు గుర్తింపునకు సచివాలయాల యాప్ ఉపయోగించి, హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ ద్వారా అధికారుల నుంచి ముందస్తు సెలవులకు అనుమతులు తీసుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, గ్రేడ్-1, గ్రేడ్-5, VROలు అందరికీ వర్తిస్తుందన్నారు.
News December 24, 2024
ఎలమంచిలి: బీజేపీలో చేరనున్న ఆడారి కుటుంబం?
వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, ఆయన సోదరి ఎలమంచిలి మున్సిపల్ ఛైర్‌పర్సన్ రమాకుమారి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. మంగళవారం ఎలమంచిలిలో మున్సిపల్ ఛైర్ పర్సన్ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో సమావేశం నిర్వహించడంతో దీనికి మరింత బలం చేకూరింది. ఈనెల 25న రాజమండ్రిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారంటూ వైరల్ అవుతోంది.
News December 24, 2024
ఈనెల 27న ధర్నా చేస్తాం: విజయసాయిరెడ్డి
విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈనెల 27న వైసీపీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తెలిపారు. మంగళవారం మద్దిలపాలెం జిల్లా పార్టీ కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు పెంచబోమని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.