News January 16, 2026
విశాఖలో భూ లిటిగేషన్‌లతో తలపోటు (1/2)

విశాఖలో భూ లిటిగేషన్లు మరోసారి తలపోటుగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భూములపై అక్రమార్కులు తిష్ట వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో వివాదాలు తెరపైకి రావడం యంత్రాంగానికి సవాల్‌గా మారింది. శివారు ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరగడంతో యాజమాన్య హక్కులపై సవాళ్లు పెరుగుతున్నాయి.
Similar News
News February 20, 2026
సంగారెడ్డి: 25 నుంచి EXAMS.. ఫోన్‌కు హాల్ టికెట్స్

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలైనట్లు అధికారి గోవిందారం శుక్రవారం తెలిపారు. విద్యార్థుల మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ లింకులు పంపామని, వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు నేరుగా కళాశాల ప్రిన్సిపల్స్ వద్ద కూడా వీటిని తీసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News February 20, 2026
పెనుబల్లి: మిత్రుడి కోసం వచ్చి.. అనంతలోకాలకు!

మిత్రుడి దశదినకర్మకు హాజరై తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏలూరు జిల్లా ఎండపల్లికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బర్రె వంశీ మృతి చెందారు. పెనుబల్లి వద్ద గురువారం బైక్ అదుపుతప్పి డ్రైనేజీని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. సత్తుపల్లి డిపోలో పనిచేస్తున్న వంశీకి భార్య, ఏడాది కుమార్తె ఉన్నారు. స్నేహితుడిని కడసారి చూసేందుకు వచ్చి, తానూ విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
News February 20, 2026
NTR జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలు

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమల్లో ఉందని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు శుక్రవారం తెలిపారు. రాజకీయ పార్టీ మీటింగులు, ఊరేగింపులు చేయకూడదన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అనుమతులు తీసుకొని సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సెక్షన్ ఏప్రిల్ 16 వరకు అమల్లో ఉంటుందన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


