News March 9, 2026
విశాఖలో మహిళా శక్తి: రాయగడకు ‘ఆల్ ఉమెన్ క్రూ’ స్పెషల్ ట్రైన్!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో మహిళా సాధికారత ప్రతిబింబించింది. భారతీయ రైల్వేలో మహిళల అంకితభావం, నైపుణ్యాన్ని చాటిచెబుతూ విశాఖ నుండి రాయగడ వరకు సోమవారం ‘ఆల్ ఉమెన్ క్రూ’ ప్రత్యేక రైలును అధికారులు ఘనంగా ప్రారంభించారు. లోకో పైలట్ నుండి గార్డ్ వరకు అందరూ మహిళలే కావడం వారి వృత్తిపరమైన శక్తికి నిదర్శనమని, ఇది అందరికీ స్ఫూర్తిదాయకమని రైల్వే అధికారులు తెలిపారు.
Similar News
News March 9, 2026
నల్గొండ: మార్చి 10 నుంచి పశువులకు టీకాలు

నల్గొండ జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి (FMD) నివారణకు మార్చి 10 నుంచి ఏప్రిల్ 9 వరకు ప్రత్యేక టీకా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ జి.వి. రమేష్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షల పశువులకు టీకాలు వేసేందుకు 80 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామాల వారీగా జరిగే ఈ ఉచిత టీకా కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News March 9, 2026
కడప: శనగ కొనుగోలు కేంద్రాల్లో అదనపు వసూళ్లపై జేసీ ఆగ్రహం.!

కడప జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి అదనపు వసూళ్లు చేస్తుండడంపై వస్తున్న పిర్యాదులపై జేసీ నిధిమీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనగ కొనుగోలు కేంద్రాల్లోని పరిస్థితులపై సోమవారం సాయంత్రం కడపలో సంబంధిత అధికారులతో జేసీ సమావేశం నిర్వహించారు. హ్యాండ్లింగ్, క్లీనింగ్ పేరుతో అదనపు వసూళ్లపై ఆరా తీశారు. కలెక్టర్ వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. మార్క్ ఫెడ్ DM, DCMS BM, DCO పాల్గొన్నారు.
News March 9, 2026
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యలను విచారించి బాధితులకు న్యాయం చేయాలని, జాప్యం లేకుండా వేగవంతమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.


