News October 15, 2025

విశాఖలో మహిళ దారుణ హత్య

image

విశాఖలో బుధవారం సాయంత్రం దారుణ హత్య జరిగింది. అక్కయ్యపాలెం నందగిరినగర్‌లో శ్రావణ్ సంధ్యారాణి అనే మహిళను కార్పంటెర్ శ్రీను అనే వ్యక్తి పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపేశాడు. భర్తకు దూరంగా ఉంటున్న సంధ్యారాణి అదే వీధిలో నివాసం ఉంటుంది. ఫోర్త్ టౌన్ పోలీసులు శ్రీనుని అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 17, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓ కొత్తగూడెం ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి క్యాబినెట్ ఆమోదం
✓ చుంచుపల్లి: మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
✓ మత్తు పదార్థాలు నియంత్రించాలని ఇల్లందులో పోలీసుల ర్యాలీ
✓ అశ్వాపురం: అక్రమంగా ఇసుక రవాణా.. 9 మందిపై కేసు
✓ మణుగూరు: అశోక్ నగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్
✓ భద్రాచలం: గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి
✓ బూర్గంపాడు: చెరువులో పడి వ్యక్తి మృతి
✓ జాతీయస్థాయిలో కరకగూడెం బిడ్డకు స్వర్ణం

News October 17, 2025

నర్సాపూర్: ముగ్గురు ఉపాధ్యాయులు సస్పెండ్

image

నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులను జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ సస్పెండ్ చేశారు. ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఒక ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించాలన్న సమాచారంతో విచారణ చేపట్టిన డీఈవో వారిని గురువారం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

News October 17, 2025

గంభీర్‌తో రోహిత్.. క్యాప్షన్ ప్లీజ్!

image

టీమ్ ఇండియా కెప్టెన్సీ చేజారిన తర్వాత రోహిత్ శర్మ తొలిసారి కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి కనిపించారు. ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా గంభీర్.. హిట్‌మ్యాన్‌కు సలహాలు ఇచ్చారు. రోహిత్ సీరియస్‌గా చేతులు కట్టుకుని కోచ్ మాటలు విన్నారు. అంతకుముందు రోహిత్ శర్మ.. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, లోకల్ బౌలర్లను ఎదుర్కొన్నారు. పై ఫొటోకు మీ క్యాప్షన్ ఏంటో కామెంట్ చేయండి.