News February 27, 2025
విశాఖలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

విశాఖలో గురువారం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు జరిగాయి. జిల్లాలోని 13 కేంద్రాల్లో 87.30 శాతం ఓటింగ్ నమోదైనట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు ఎన్నికల విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు.
Similar News
News February 27, 2025
విశాఖలో 300 ప్రత్యేక బస్సు సర్వీసులు

విశాఖలో శివరాత్రి మహా పర్వదినం పురస్కరించుకొని 300 ప్రత్యేక బస్సులను సాధారణ ఛార్జీలతో నడిపామని జిల్లా ప్రజారవాణాధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఈ సర్వీసులు నడిపామని వెల్లడించారు. నగర నలుమూలల నుంచి వివిధ బీచ్‌లు, శైవక్షేత్రాలకు ఈ బస్సులు ఏర్పాటు చేశారు. జాగరణ అనంతరం సముద్ర స్నానాలు ఆచరించే భక్తులను గమ్యస్థానాలకు చేర్చామన్నారు.
News February 27, 2025
పోసాని అరెస్టు పవన్ కళ్యాణ్ ఆలోచనే: వాసుపల్లి

ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేకనే కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతుందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ అన్నారు. పోసాని అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. పవన్, లోకేశ్ ఇద్దరి దగ్గర రెడ్ బుక్స్ ఉన్నాయన్నారు. పోసాని అరెస్టు పవన్ కళ్యాణ్ ఆలోచనే అని ఆరోపించారు.
News February 27, 2025
విశాఖ జూలో పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు

విశాఖ జూపార్క్‌లో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మార్చి 2వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జూ పార్కు బయోస్కోఫ్ వద్ద పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జూ క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. 1వ క్లాస్ నుంచి పీజీ వరకు విద్యార్థులు పోటీలలో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు జూ కార్యాలయాన్ని సంప్రదించాలని, జీవవైవిద్య పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.