News March 27, 2025
విశాఖలో ముఠా.. నకిలీ వెండి అమ్ముతూ అరెస్ట్

విశాఖలో బిహార్‌కు చెందిన ఇద్దరు మహిళలు నకిలీ వెండి అమ్ముతూ పోలీసులకు చిక్కారు. నగరంలోని ఓ జువెలరీ షాపులో 3 కేజీల వెండిని అమ్మేందుకు వెళ్లారు. అనుమానంతో షాపు సిబ్బంది పరీక్షించగా అది నకిలీదిగా తేలడంతో ద్వారకా పోలీసులకు సమాచారమిచ్చారు. ఇదే షాపులోని 2023లో నిందితులు ఏడు గ్రాముల గోల్డ్ కొట్టేసినట్లు గుర్తించారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఐడీలతో మోసాలకు పాల్పడి అనంతరం సొంతూళ్లకు వెళ్లిపోతారు.
Similar News
News September 13, 2025
విశాఖ: బీజేపీ సభ ఏర్పాట్ల పరిశీలన

విశాఖ రైల్వే మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న బహిరంగ సభ ప్రాంతాన్ని మంత్రి సత్య కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ పరిశీలించారు. జేపీ నడ్డా హాజరవుతున్న ఈ సభకు మరి కొంతమంది ప్రముఖులు కూడా రానున్నారని వారు పేర్కొన్నారు. దీంతో కార్యకర్తల సమీకరణ, స్వాగత ఫ్లెక్సీలను పరిశీలించారు. సభకు దాదాపు 20,000 మంది హాజరవుతారని అంచనా.
News September 13, 2025
జగ్గు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం మహిళ మృతి

గాజువాక సమీపంలోని జగ్గు జంక్షన్ వద్ద నడిచి వెళుతున్న మహిళను ట్రాలర్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నగంట్యాడ సమీపంలో నివాసముంటున్న విజయలక్ష్మి జగ్గు జంక్షన్ సమీపంలో నడిచి వెళుతుండగా స్టీల్‌ప్లాంట్ నుంచి వస్తున్న ట్రాలర్ ఢీకొంది. ఘటనాస్థలానికి గాజువాక ట్రాఫిక్ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News September 13, 2025
విశాఖ: NMMS పరీక్షకు దరఖాస్తు చేశారా?

2025-26 విద్యాసంవత్సరానికి గాను నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ కుమార్ తెలిపారు. రూ.3.50 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న 8వ తరగతి విద్యార్థులు అర్హులు. సెప్టెంబర్ 30వ తేదీలోగా www.bse.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష డిసెంబర్ 7న జరుగుతుంది.