News December 3, 2024

విశాఖలో మెట్రో స్టేషన్లపై మీ కామెంట్

image

విశాఖలో 46.23km మేర 3 కారిడార్లను నిర్మించనునున్న మెట్రో పాజెక్టులో 42 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. <<14776969>>స్టీల్ ప్లాంట్ <<>>నుంచి కొమ్మాది(34.4km) మధ్య 29, గురుద్వార-<<14777184>>పాతపోస్టాఫీసు<<>>(5.08kms)మధ్య 6, తాడిచెట్లపాలెం-<<14777236>>చినవాల్తేర్ <<>>(6.75km) మధ్య 7 స్టేషన్లు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. మరి ఏయే ప్రాంతాల్లో మెట్రో స్టేషన్ ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందో కామెంట్ చెయ్యండి.

Similar News

News December 4, 2024

విశాఖలో స్వల్ప భూప్రకంపన..!

image

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విశాఖలోని అక్కయ్యపాలెం సహా పలు ప్రాంతంలో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. మరి మీ ప్రాంతంలోనూ భూ ప్రకంపనలు వచ్చాయా?

News December 4, 2024

ఈనెల 5న విశాఖ రానున్న సీఎం చంద్రబాబు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 5న విశాఖ వస్తున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. చంద్రబాబు రెండు రోజులు పాటు విశాఖలో ఉండి విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ)పై సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వీఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్.విశ్వనాథన్ మంగళవారం పరిశీలించారు.

News December 4, 2024

కేంద్ర మంత్రితో విశాఖ ఎంపీ భేటీ

image

కేంద్ర పరిశ్రమలు & వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో విశాఖ ఎంపీ శ్రీభరత్ ఢిల్లీలో మంగళవారం భేటీ అయ్యారు. వాణిజ్య మంత్రిత్వ శాఖకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఎంపీ పారిశ్రామిక వృద్ధి, అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే విశాఖ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కాకినాడలో ఐఐఎఫ్టీ పురోగతిపై చర్చించారు.