News April 12, 2024

విశాఖలో యాక్సిడెంట్.. యువకుడు మృతి

image

విశాఖలోని సిరిపురం శ్రీలక్ష్మి గణపతి ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనాన్ని కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా వేపాడ మండలానికి చెందిన రాజకుమార్(30) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ సీఐ అమ్మి నాయుడు కేసు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 5, 2026

విశాఖ: ఇంటింటికీ మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్

image

విశాఖలో జీవీఎంసీ మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్ రోజుకు సుమారు 50 నీటి పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది జనవరి 1న ప్రారంభమైన ఈ ల్యాబ్ రాష్ట్రంలో తొలి మొబైల్ సదుపాయం. రూ.40 లక్షలతో ఏర్పాటైన ఈ వాహనం 98 వార్డుల్లో తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి నీటి నాణ్యతను పరీక్షిస్తోంది. పీహెచ్, క్లోరిన్, టీడీఎస్, టర్బిడిటీ వంటి ప్రమాణాలను వెంటనే నిర్ధారిస్తున్నారు. ఇప్పటివరకు కాలుష్యం గుర్తించలేదని అధికారులు తెలిపారు.

News April 4, 2026

విశాఖలో పర్యటించనున్న కేంద్ర సమాచార కమిషనర్ సుధారాణి

image

సమాచార కమిషనర్ సుధారాణి రేలంగి ఈనెల 6, 7వ తేదీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. 6న ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకోనున్నారు. 7న ఉదయం 10 గంటలకు DSNLUలో జరిగే దక్షిణ ప్రాంత లా రివ్యూ కన్సల్టేషన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పర్యటనకు అధికారులు భద్రత, రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు.