News February 24, 2026

విశాఖలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

విశాఖలోని మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మురళి నగర్ జాతీయ రహదారిపై స్కూటీపై వెళుతున్న వ్యక్తిని విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సు ఢీకొనడంతో అక్కడకక్కడ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 27, 2026

జగిత్యాల: పీఎం పోషణ్ తనిఖీ.. కేజీబీవీని సందర్శించిన కలెక్టర్

image

జగిత్యాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. పీఎం పోషణ్ తనిఖీలో భాగంగా మధ్యాహ్న భోజన నాణ్యత, వంటగది పరిశుభ్రత, నిల్వ విధానాలను పరిశీలించారు. పదో తరగతి ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక తరగతులు, మోడల్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News February 27, 2026

డోంట్ వర్రీ.. పులి కదలికల్ని గమనిస్తున్నాం: రంప FRO

image

పులి కదలికలు రేడియో కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తునట్లు రంపచోడవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రంపచోడవరం అటవీ డివిజన్‌లోని రంప, పెద్దకొండ, సూదికొండ, భీమవరం అటవీ సమీప గ్రామాలలో అటవీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పులి కదలికలు డ్రోన్ థెర్మల్ ఇమేజ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, ఆందోళన చెందవద్దని ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు..

News February 27, 2026

మార్చి 3న కనకమహాలక్ష్మీ అమ్మవారి దర్శనాలు నిలిపివేత

image

చంద్ర గ్రహణం సందర్భంగా మార్చి 3వ తేదిన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30వరకు కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తునట్టు ఈఓ శోభారాణి తెలిపారు. ఆరోజు ఉదయం పంచామృతాభిషేకం అనంతరం గుడి మూసి వేయనున్నట్టు తెలిపారు. గ్రహణానంతరం రాత్రి సంప్రోక్షణ నిర్వహించి తిరిగి దర్శనాలకు అనుమతిస్తామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.