News August 30, 2025

విశాఖలో యుద్ధ విమాన మ్యూజియం మూసివేత

image

విశాఖ బీచ్ రోడ్డులోని TU-142 యుద్ధ విమాన మ్యూజియం సందర్శన తాత్కాలికంగా నిలిపివేశారు. నిర్వహణ పనుల కారణంగా సెప్టెంబర్ 1 నుంచి 2వ తేదీ వరకు సందర్శకులను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 3 నుంచి మ్యూజియం యథావిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటుందని VMRDA కమిషనర్ కేఎస్.విశ్వనాథన్ తెలిపారు. ఈ విషయాన్ని సందర్శకులు గమనించాలని కోరారు.

Similar News

News August 30, 2025

ఆనందపురంలో ITBP కానిస్టేబుల్ ఆత్మహత్య

image

ఆనందపురం (M) పందలపాకలోని IPBP హెడ్‌క్వార్టర్స్‌లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు (D) డోన్(M)నికి చెందిన జీ.నరేంద్ర నాథ్ (32) 15 నెలలుగా ఆనందపురం 56వ బెటాలియన్ యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం హెడ్‌క్వార్టర్స్‌లోని మామిడి చెట్టుకు ఉరివేసుకొని చనిపోయినట్లు బెటాలియన్ ఇన్‌ఛార్జ్ సూరజ్ ప్రకాష్ జోషి పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News August 30, 2025

మారికవలసలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

మారికవలస జాతీయ రహదారిపై శనివారం ఉదయం యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కృష్ణాపురం సంజయ్ గాంధీ కాలనీకి చెందిన పాడి సురేంద్ర‌రావుగా స్థానికులు గుర్తించారు. పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

News August 30, 2025

విశాఖ జీవీఎంసీలో ఉద్యోగులకు పదోన్నతులు

image

జీవీఎంసీలో సీనియర్ అసిస్టెంట్‌లుగా విధులు నిర్వహిస్తున్న ఏడుగురికి పదోన్నతి లభించింది. వారికి జీవీఎంసీ పర్యవేక్షకులుగా పదోన్నతి పత్రాలను మేయర్ పీలా శ్రీనివాసరావు అందించారు. సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. జీవీఎంసీలో పనిచేసే అర్హత కలిగిన ఉద్యోగులందరికీ రాబోయే రోజుల్లో పదోన్నతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణ మూర్తి పాల్గొన్నారు.