News September 5, 2025
విశాఖలో రూ.5.25 కోట్ల భారీ మోసం

స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో విశాఖలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు చెందిన ముగ్గురు నిందితులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ద్వారకానగర్‌కు చెందిన ఒక వ్యక్తిని సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా సంప్రదించారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.5.25 కోట్లు దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
Similar News
News September 7, 2025
HPCLలో అగ్నిప్రమాదంపై స్పందించిన హోంమంత్రి అనిత

విశాఖలోని ఈస్ట్ ఇండియా పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పిడుగు పడిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి అనిత అగ్నిమాపకశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చాయని, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని ప్రజలెవరూ భయాందోళన చెందవద్దని పేర్కొన్నారు.
News September 7, 2025
జూ పార్కులో వివిధ రకాల జంతు, పక్షి పిల్లల జననం

విశాఖ జూ పార్కులో ఏడు జంతు, పక్షి పిల్లలు జన్మించాయి. చౌసింఘా, బ్లూ గోల్డ్ మకావ్, బ్లాక్ బక్ వంటి జాతులకు సంబందించిన పిల్లలు జన్మించినట్లు క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. బ్లూ గోల్డ్ మకావ్‌ను కొన్ని వారాలుగా నియంత్రిత ఇంక్యుబేషన్ సెంటర్లో ఉంచామన్నారు. వీటిని జూ వైద్య బృందం జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారని, నూతన జంతు, పక్షి జాతులను అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
News September 7, 2025
విశాఖ: కొనసాగుతున్న సహాయక చర్యలు

ఈస్ట్ ఇండియా పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో పిడుగు పడిన విషయం తెలిసిందే. ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద పార్కింగ్ సమీపంలో ఉన్న ఇందనాల్ ట్యాంకర్ పై పిడుగు పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. సంస్థలో మిగతా ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. మల్కాపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.