News April 2, 2024
విశాఖలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

విశాఖలో బుధవారం జరగనున్న ఐపీఎల్ టీ-20 మ్యాచ్ సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి రాత్రి 12:00 వరకు భారీ వాహనాలకు మధురవాడ స్టేడియం వైపు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే వాహనాలు సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా వెళ్ళాలి.
Similar News
News December 19, 2025
స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర (SASA) పక్కాగా నిర్వహించాలి: విశాఖ కలెక్టర్

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 3వ శనివారం విశాఖలో ‘పర్యావరణంలో అవకాశాలు’ అంశంపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలు (SHGలు), స్టార్టప్‌లు, స్థానిక వ్యాపారులు అభివృద్ధి చేసిన రీసైకిల్, అప్‌సైకిల్, పర్యావరణహిత ఉత్పత్తులను ప్రదర్శించాలన్నారు.
News December 19, 2025
బురుజుపేట: కనకమహాలక్ష్మి అమ్మవారికి సారె సమర్పణ

బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహోత్సవాల్లో అఖరి రోజు కావడంతో శుక్రవారం ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళలు అమ్మవారికి పెద్ద ఎత్తున సారె సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈవో శోభారాణి అని ఏర్పాట్లు చేశారు. ఆలయావరణంలో ప్రత్యేక ప్రసాదం కౌంటర్లను అందుబాటులో ఉంచారు.
News December 19, 2025
విశాఖలో కిలో బీన్స్ పిక్కలు రూ.125

విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు శుక్రవారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. టమాటా రూ.46, ఉల్లి రూ.28, బంగాళదుంప రూ.13, వంకాయ రూ.42, బెండ రూ.54, మిర్చి రూ.44, బీరకాయ రూ.62, కాలిఫ్లవర్ రూ.26, కాకరకాయ రూ.60, చిలకడ దుంప రూ.34, దొండకాయ రూ.42, క్యారెట్ రూ.38, చిక్కుడుకాయ రూ.60, బీట్రూట్ రూ.34, పెన్సిల్ బీన్స్ రూ.50, బీన్స్ పిక్కలు రూ. 125, పొటల్స్ రూ.54, క్యాప్సికం రూ.44గా ఉన్నాయి.


