News March 23, 2025
విశాఖలో రేపే మ్యాచ్..

దేశంలో IPL ఫీవర్ స్టార్ట్ అయింది. శనివారం నుంచి మ్యాచ్‌లు మొదలు కాగా క్రికెట్ అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. కాగా ఈ ఏడాది విశాఖ 2 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం విశాఖలో జరిగే ఢిల్లీ- లక్నో మ్యాచ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ACA తెలిపింది. రేపు సాయంత్రం 6.30 నుంచి మెగా సెలబ్రేషన్స్‌తో విశాఖలో ఐపీఎల్ సందడి మొదలు కానుంది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
Similar News
News November 11, 2025
ఖమ్మం జిల్లాలో 441 ఇందిరమ్మ ఇళ్లకు సమస్య

ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు నిలిచిపోవడంతో ఖమ్మం జిల్లాలో 441 మంది లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 52 మందికి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని, 260 మందికి గతంలో ఇల్లు మంజూరైందని అధికారులు బిల్లులు నిలిపివేశారు. మరో 129 ఇళ్లు బేస్మెంట్ పూర్తి కాగా అధికారులు పరిశీలించాల్సి ఉంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
News November 11, 2025
వరంగల్: నేడు జాబ్ మేళా

జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 11న ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగనుందని అధికారి సాత్విక తెలిపారు. ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఖాళీలు ఉన్నాయి. 18-34 ఏళ్ల వయస్సు గల యువత ఉదయం 11 గంటలకు వరంగల్, ములుగు రోడ్ వద్ద ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణానికి హాజరుకావాలని సూచించారు.
News November 11, 2025
కోడిగుడ్డు పెంకుతో ఇన్ని లాభాలా!

కోడిగుడ్డులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని పిల్లలకు ఉడికించిన గుడ్లు ఇస్తుంటారు. అయితే, కేవలం గుడ్డులోపల ఉన్న పదార్థం మాత్రమే కాదు.. బయట ఉండే పెంకుతోనూ చాలా లాభాలు ఉంటాయి.- కోడిగుడ్డు పెంకులను పడేయకుండా మొక్కల కుండీల్లో వేస్తే ఎరువుగా ఉపయోగపడతాయి. -గుడ్డు పెంకులను మెత్తగా చేసి తేనె కలిపి ముఖానికి రాస్తే చర్మం మెరుస్తుంది. – పెంకుల పొడిలో బేకింగ్ సోడా, కొబ్బరినూనె కలిపి అప్లై చేస్తే దంతాలు మెరుస్తాయి.


