News March 16, 2026

విశాఖలో రోడ్డు ప్రమాదం.. తుని యువతి మృతి

image

విశాఖపట్నం BHPV వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతి చెందారు. స్కూటీపై వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో పార్వతీపురానికి చెందిన సీహెచ్ అనూష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తుని గవరపేటకు చెందిన ఆడారి కుసుమాంజలి మహాలక్ష్మి (19) చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. ఈ ఘటనతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 14, 2026

రంగారెడ్డిలో 40 దాటింది.. జాగ్రత్త!

image

రంగారెడ్డిలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇబ్రహీంపట్నం పరిధి దండుమైలారంలో గరిష్ఠంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మాడ్గుల్, ఎలిమినేడు ప్రాంతాల్లో 41.7 డిగ్రీలు, బోడకొండ, రాచులూరు ప్రాంతాల్లో 41.6 డిగ్రీలు నమోదయ్యాయి. యాచారం, మొయినాబాద్, కడ్తాల్ ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలో బయటకు వెళ్లకపోవడం మంచిదని నిపుణులు సూచించారు.
SHARE IT

News April 14, 2026

నిర్మల్: ఆడపిల్ల పేరిట రూ.5వేలు, 2 శ్రీగంధం మొక్కలు

image

నిర్మల్‌లోని అనంత్ పేట సర్పంచ్ సునీత ‘మా ఊరి బంగారు తల్లి’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఊరిలో ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆ పాప పేరు మీద బ్యాంకులో రూ. 5వేలు జమ చేయడంతో పాటు 2 శ్రీగంధం మొక్కలు బహుమతిగా అందజేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆడపిల్ల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేందుకు ఈ కార్యక్రమం చెపట్టామని సునీత తెలిపారు.

News April 14, 2026

HYDలో 40 దాటింది.. జాగ్రత్త!

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియా, కీసర ప్రాంతాల్లో గరిష్టంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దుండిగల్, దమ్మాయిగూడ, మేడిపల్లి ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి, ఎండలో బయటకు వెళ్లవద్దని సూచించింది.
SHARE IT