News March 3, 2025

విశాఖలో రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

image

విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు నగర పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు పోలీసులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఆదేశించారు. లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకొని, పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. రౌడీ షీటర్ల మీద నిత్యం పోలీసుల నిఘా ఉంటుందన్నారు.

Similar News

News March 3, 2025

రుషికొండ బ్లూఫ్లాగ్ గుర్తింపుపై అసెంబ్లీలో ప్రస్తావించిన గంటా

image

రుషికొండ బీచ్ బ్లూఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేయడంపై భీమిలి MLA గంటా శ్రీనివాసురావు అసెంబ్లీలో ప్రస్తావించారు. విశాఖకు ముఖ్యమైన IT, టూరిజంని అభివృద్ధి చేయాలని కోరారు. ఒకసారి బ్యాడ్ రిమార్క్ వస్తే ఇంటర్నేషనల్ టూరిస్టులు వెనుకడుగు వేస్తారని అన్నారు. ఈ నాలుగైదు రోజుల్లో బ్లూఫ్లాగ్ కమిటీ వస్తుందని ఆ టైంకి పునరుద్ధరించాలన్నారు. రద్దుకు కారణం ఎవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News March 3, 2025

విశాఖలో నేటి నుంచి పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు

image

నేటి నుంచి ఈనెల 13వ తేది వరకు పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గంట ముందు మండల విద్యాశాఖ కార్యాలయం నుంచి ప్రశ్న పత్రాలు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4:45 వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులకు పరీక్షలపై భయం పోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని అన్నారు.

News March 3, 2025

టైమొచ్చింది.. విశాఖ మేయర్ పీఠం కదులుతుందా..?

image

జీవీఎంసీ మేయర్ పీఠం చేజిక్కించుకునేందుకు కూటమి కసరస్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మార్చి 18కి జీవీఎంసీ మేయర్‌ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీవీఎంసీ బడ్జెట్ సమావేశం నిర్వహించకపోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.

error: Content is protected !!