News March 27, 2025
విశాఖలో లులూ మాల్‌కు భూమి కేటాయింపు

విశాఖలో లులూ గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమి కేటాయించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీఐఐసీ ద్వారా భూకేటాయింపులు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీచ్ రోడ్‌లోని హార్బర్ పార్కులో ఉన్న 13.43 ఎకరాలను ఏపీఐఐసీకి బదలాయించాలని వీఎంఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. లులూ గ్రూప్ విశాఖలో పెట్టుబడులకు ఎస్ఐపీబీలో ఆమోదించినట్టు పరిశ్రమల శాఖ తెలిపింది.
Similar News
News March 30, 2025
పండగల నేపథ్యంలో విశాఖ కలెక్టర్ సూచన

ఉగాది, రంజాన్ సందర్భంగా విశాఖ ప్రజలకు కలెక్టర్ ఎమ్.ఎన్ హరేంధిర ప్రసాద్ ముఖ్యమైన సూచన చేశారు. ఈ రెండు రోజుల క్లాప్ వాహనముల ద్వారా వచ్చే జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. దీంతో వారు చెత్త సేకరణకు రారని తెలిపారు. వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో పడవేయకుండా పబ్లిక్ బిన్స్‌లలో వేయాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు తడి, పొడి చెత్తగా విభజించిన అందించాలన్నారు.
News March 30, 2025
పన్నులపై 50% వడ్డీ రాయితీ పొందండి: కలెక్టర్

జీవీఎంసీ పరిధిలో చెల్లించవలసిన ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిదారులకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గుడ్‌న్యూస్ చెప్పారు. పన్ను మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తే వడ్డీపై 50 శాతం వడ్డీ మినహాయింపు ఇచ్చినట్లు ఆయన మంగళవారం తెలిపారు. మార్చి 31వ తేదీ లోగా బకాయిలు చెల్లించి ఈ లబ్ధి పొందాలని సూచించారు.
News March 30, 2025
నేడు విశాఖ రానున్న మంత్రి నారా లోకేశ్

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆదివారం విశాఖ రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన IPL మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంకు చేరుకుంటారు. మ్యాచ్ అనంతరం రామ్‌నగర్‌లో గల ఎన్టీఆర్ భవన్‌కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. వీటికి తగ్గట్టు పార్టీ వర్గాలు ఏర్పాటు చేస్తున్నారు.