News December 1, 2024

విశాఖలో వర్షం.. మ్యాచ్ రద్దు

image

విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరగాల్సిన ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు చేశారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా మధ్యాహ్నం 2 రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత కొన్ని రోజులుగా విశాఖలో మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే.

Similar News

News September 17, 2025

జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించిన విశాఖ మేయర్

image

విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు కార్పొరేటర్లతో కలిసి అధ్యయన యాత్రలో భాగంగా జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బుధవారం సందర్శించారు. జైపూర్ మేయర్ డా.సౌమ్య గుర్జర్‌ను శాలువ వేసి సత్కరించగా, ఆమె కూడా విశాఖ మేయర్‌కు మెమెంటో అందించారు. జైపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, శానిటేషన్ విధానాలు, టూరిజం చర్యలపై అధికారులు వివరాలు అందించారు.

News September 17, 2025

విశాఖ: మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

image

విశాఖలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థి బుధవారం మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాకు చెందిన విస్మద్ సింగ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 17, 2025

విశాఖలో హెల్త్ క్యాంప్‌ను సందర్శించిన సీఎం

image

CM చంద్రబాబు విశాఖలో నిర్వహించిన ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ <<17736648>>హెల్త్ క్యాంప్‌<<>>ను సందర్శించారు. గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లకు మహిళలు ముందుకు రావడం లేదని, వారికి అవగాహన కల్పించి విలేజ్ క్లీనిక్ సెంటర్‌లో టెస్ట్‌లు చేసుకునేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి సత్యకుమార్ CMకి వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను పరిశీలించిన CM ఓ చంటి బిడ్డకు డ్రాప్స్ వేశారు.