News December 28, 2025
విశాఖలో వార్షిక నేర సమీక్షా సమావేశం

విశాఖ నగరం ఉడా చిల్డ్రన్ ఎరీనాలో పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో ‘వార్షిక నేర సమీక్ష–2025’ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్ర ప్రసాద్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు పాల్గొని సమర్థవంతమైన పోలీసింగ్‌కు పలు సూచనలు చేశారు. నగరంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్, క్రైమ్ అంశాలపై సీపీ సమీక్షించి, వచ్చే ఏడాదికి దిశానిర్దేశం చేశారు.
Similar News
News December 29, 2025
గాజువాక: ఉరి వేసుకుని బాలుడి ఆత్మహత్య

గాజువాక డిపో 59 వార్డు నక్కవానిపాలెంలో ఓ బాలుడు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో యుగంధర్ వర్మ (16) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. బాలుడి అత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News December 29, 2025
విశాఖ: ప్రభుత్వ కార్యాలయలలో నేడు పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 28, 2025
విశాఖ: ‘స్త్రీ శక్తి’ పథకం ఎఫెక్ట్.. 75%కి పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్య

విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు గాజువాక, స్టీల్ సిటీ డిపోలను శనివారం తనిఖీ చేశారు. ‘స్త్రీ శక్తి’ పథకంతో జిల్లాలో మహిళా ప్రయాణికుల సంఖ్య 75%కి పెరిగిందని, దీనివల్ల టికెట్ మిషన్ల ఛార్జింగ్ త్వరగా అయిపోతోందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కండక్టర్లకు 20,000 mAh పవర్ బ్యాంక్స్ పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎంఈ గంగాధర్ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


