News April 12, 2024
విశాఖలో విజయనగరం జిల్లా యువకుడు మృతి

విశాఖలోని సిరిపురం శ్రీలక్ష్మి గణపతి ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనాన్ని కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా వేపాడ మండలానికి చెందిన రాజకుమార్(30) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ సీఐ అమ్మి నాయుడు కేసు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News July 9, 2025
VZM: ‘ఆ వాహనాలను త్వరితగతిన గుర్తించాలి’

హిట్ అండ్ రన్ కేసుల్లో నేరానికి పాల్పడిన వాహనాలను త్వరితగతిని గుర్తించాలని SP వకుల్ జిందాల్ ఆదేశించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కేసుల్లో బాధితులకు పరిహారం చెల్లించేందకు సాక్ష్యాలను సేకరించి RDOకు పంపాలన్నారు. అలాగే వివిధ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తులో ఉన్న 194BNSS (గుర్తు తెలియని మృతదేహాల) కేసులను సమీక్షించారు. కేసుల దర్యాప్తు అంశాలను పొందుపరచాలన్నారు.
News July 8, 2025
VZM: ‘బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియ పూర్తి చేయండి’

P4 కార్యక్రమంలో భాగంగా వెంటనే మార్గదర్శులను గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లా అధికారులు, ఆర్‌డివోలు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లతో సోమవారం కలెక్టర్ తమ ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 67,066 బంగారు కుటుంబాలను గుర్తించామని, వారి దత్తత ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు.
News July 8, 2025
జిల్లా వ్యాప్తంగా 500 ఎకరాల్లో ఉద్యాన మొక్కలు: కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద విజయనగరం జిల్లాలో 500 ఎకరాల్లో ఉద్యాన మొక్కలను నాటనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టర్ తన ఛాంబర్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. 8 నియోజకవర్గాల్లో ఉన్న 27 మండలాల్లో సుమారుగా 477 మంది రైతులకు మామిడి, జీడిమామిడి, కొబ్బరి, సపోటా, జామ మొదలగు 23 రకాల పండ్ల తోటలు మొక్కలు వేయుటకు సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.