News September 24, 2025
విశాఖలో వి-జ్యువెలరీ మార్ట్ రెండో షోరూమ్

సంపత్ వినాయక టెంపుల్ సమీపంలోని ఆశీల్ మెట్టలో వి-జ్యువెలరీ మార్ట్ రెండో షోరూమ్‌ను ప్రారంభించారు. ఇక్కడ వినూత్నమైన కలెక్షన్‌లు అందుబాటులో ఉంచామని షోరూమ్ యాజమాన్యం చెప్పింది. ప్రారంభోత్సవ ఆఫర్‌గా అన్ని రకాల 22KT బంగారు అభరణాలను మార్కెట్ ధర కన్నా తక్కువకే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆభరణాలపై తరుగు 6.96% నుంచి ఉందన్నారు. వెండి వస్తువులపై తరుగు, మజూరు లేదని.. GST కూడా తామే చెల్లిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News September 24, 2025
రేవులపల్లి-నందిమల్ల వంతెన కోసం ఎంపీకి వినతి

ధరూర్ మండలం రేవులపల్లి-నందిమల్ల మధ్యలో పాత జీవో ప్రకారం వంతెన (HLRB) నిర్మించాలని రేవులపల్లి అఖిలపక్ష కమిటీ సభ్యులు ఎంపీ డీకే అరుణమ్మకు బుధవారం వినతిపత్రం అందజేశారు. వంతెన రేవులపల్లి-నందిమల్ల మధ్య వచ్చేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమంతరాయ, గుర్రాజు, పోస్టు వెంకటయ్య, చెట్టుకింది నర్సింహులు, అంజన్ కుమార్, బండ శ్రీను, లక్ష్మయ్య, రమేశ్ పాల్గొన్నారు.
News September 24, 2025
GST 2.0తో పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట: కలెక్టర్

GST 2.0తో పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట కలుగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. GST 2.0 వ్యవసాయం, పారిశ్రామిక, భవన నిర్మాణం, విద్యారంగం, వర్తక రంగాలకు ఎంతో ఊతమిస్తుందన్నారు. ప్రజలు వినియోగించే నిత్యావసరాలు, మెడిసిన్, వ్యసాయ పరికరాలు, భవన నిర్మాణ సామాగ్రి, ఆటోమొబైల్ రంగాల్లోని ఉత్పత్తులపై భారీగా జీఎస్టీ తగ్గిందన్నారు.
News September 24, 2025
అందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలి: కవిత

వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. బుధవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అమ్మవారి కరుణ, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.