News June 5, 2024

విశాఖలో వైఎస్ఆర్ పేరుపై స్టిక్కర్..!

image

విశాఖ సీతకొండ దగ్గర YSR వ్యూ పాయింట్ పేరును అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌గా గుర్తు తెలియని వ్యక్తులు మార్చారు. జీ-20 సమయంలో విశాఖ నగరాన్ని సుందరీకరించి సీతకొండ దగ్గర వ్యూ పాయింట్‌ను వైఎస్ఆర్ వ్యూ పాయింట్‌గా నామకరణ చేసి ఇక్కడ నేమ్ బోర్డు సైతం పెట్టారు. తాజాగా వైఎస్సార్ అక్షరాలపై అబ్దుల్ కలాం స్టిక్కర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అతికించినట్లు తెలుస్తోంది.

Similar News

News September 15, 2025

విశాఖ: బస్సుల్లో రద్దీ.. ప్రయాణ సమయాలు మార్చుకోవాలని పిలుపు

image

స్త్రీ శక్తి పథకంతో జిల్లాలోని బస్సుల్లో రద్దీ పెరిగిందని, RTC ప్రయాణికులు తమ ప్రయాణ సమయాలను మార్చుకోవాలని RTC విశాఖ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు సూచించారు. రద్దీకి తగ్గట్లు ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవడం లేదన్నారు. ఉదయం 7 నుంచి 10, సా. 4- 7 గంటల వరకు విద్యార్థులు, కార్మికులు, ఇతర ప్రయాణికుల రద్దీ ఉంటోందన్నారు. దీంతో ఉ.10 నుంచి, సా.7 తర్వాత ప్రయాణాలు చేసేలా చూసుకోవాలని మహిళలు, ప్రయాణికులను కోరారు.

News September 15, 2025

మధురవాడలో ముగిసిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు

image

మధురవాడ శిల్పారామంలో రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు విజయవంతంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో సుమారు 200 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు. ముగింపు వేడుకల్లో సీపీ శంఖబ్రత బాగ్చి పాల్గొని విజేతలకు మెడల్స్ అందజేశారు. అనంతరం మహిళలకు ఆత్మరక్షణలో తైక్వాండో ప్రాధాన్యాన్ని వివరించారు.

News September 14, 2025

రుషికొండ బీచ్‌లో ఇద్దరు బాలురు గల్లంతు

image

రుషికొండ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. పీఎం పాలెం, ఆర్‌హెచ్‌ కాలనీ ప్రాంతాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు సంజయ్, సాయితో పాటు మరో ఇద్దరు రుషికొండ బీచ్‌కు వెళ్లారు. అక్కడ స్నానానికి దిగగా అలల ఉద్ధృతికి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరిని మెరైన్ పోలీసులు, లైఫ్ గాడ్స్ కాపాడారు. సంజయ్, సాయి అచూకీ ఇంకా లభ్యం కాలేదని పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపారు.