News September 21, 2025
విశాఖలో శొంఠ్యాం కోడి రూ.300

మాధవధార, మురళి నగర్, మర్రిపాలెంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కేజీ చికెన్ లైవ్ రూ.160, స్కిన్ లెస్ రూ.280, విత్ స్కిన్ రూ.260, శొంఠ్యాం కోడి రూ.300కి విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.1,000గా ఉంది. ఆదివారం కావడంతో వినియోగదారులు అధిక సంఖ్యలో మాంసం దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు.
Similar News
News September 21, 2025
నాగావళి ఎక్స్ప్రెస్ రీ షెడ్యూల్

విశాఖ మీదుగా సంబల్పూర్ – నాందేడ్ (20809) వెళ్లే నాగావళి ఎక్స్ప్రెస్ ఆదివారం రీ షెడ్యూలు అయింది. సంబల్పూర్లో ఆదివారం ఉదయం 10.50 గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలు మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు విశాఖలోని రైల్వే అధికారులు తెలిపారు. నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రీ షెడ్యూలు జరిగినట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఇది గమనించి సహకరించాలని కోరారు.
News September 21, 2025
సమయపాలన పాటించని జీవీఎంసీ సిబ్బంది?

జీవీఎంసీ ఉద్యోగులందరూ నిర్ణీత సమయానికే విధులకు హాజరుకావాలని అదనపు కమిషనర్ డివి రమణమూర్తి ఆదేశించారు. శనివారం విశాఖలో అన్ని జోన్ల సిబ్బందితో సమావేశమై ఉదయం9:30 నుంచి సా.5:30 వరకు వీధులు నిర్వహించాలని సూచించారు. చాలాచోట్ల మధ్యాహ్నం విధులకు హాజరు కావడంలేదని ఫిర్యాదులొస్తున్నాయన్నారు. ఎప్పటికప్పుడు ఫైల్స్ పూర్తి చేసి పంపించాలని, పెండింగ్లో ఉంచొద్దని సూచించారు. జోనల్ కమిషనర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
News September 21, 2025
గూగుల్ డేటా సెంటర్కు భూసేకరణ.. రైతుల విజ్ఞప్తులు ఇవే..!

తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం జరుగుతున్న భూసేకరణలో నష్టపరిహారం మొత్తాన్ని పెంచాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఆక్రమణదారుల భూములకు రిజిస్టర్ మార్కెట్ ధరలో సగం మేర మాత్రమే ప్రకటించిన పరిహారం మొత్తాన్ని పెంచాలని కోరారు. 20ఏళ్ల క్రితం డీఆర్డీఈ ద్వారా మొక్కల పెంపకానికి ఇచ్చిన భూములకు కూడా నష్టపరిహారం వర్తింపజేయాలన్నారు. సోమవారం విశాఖ వస్తున్న CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని గంటా హామీ ఇచ్చారు.