News February 16, 2026
విశాఖలో ‘షాడో మంత్రి’(1/3)

విభజిత విశాఖ జిల్లాలో మంత్రి పదవి లేకపోయినా ఆ సీనియర్ ఎమ్మెల్యే మీసం మెలేస్తే.. మంత్రి కన్నా పవర్‌ఫుల్‌గా పనులు అవుతున్నాయనే చర్చ సర్వత్రా నడుస్తోంది. అధికారుల బదిలీలు, బార్ టెండర్లు, లిక్కర్ సిండికేట్లు, భూముల ఫైళ్లలో ఆయన చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ‘షాడో మంత్రి’గా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Similar News
News February 16, 2026
MBNR: మహిళలకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్ నగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జె.జయప్రద ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. 2026-27 సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, రిజర్వేషన్ & మెరిట్ ఆధారితంగా సీట్లు కేటాయిస్తామని, ఈ అవకాశాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
SHARE IT
News February 16, 2026
శాఖల సమన్వయం.. ప్రశాంతంగా మహాశివరాత్రి తిరునాళ్లు

శివరాత్రి సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని శివాలయాలు భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. లక్షలాది మంది భక్తులు దర్శనానికి తరలివచ్చినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఎండోమెంట్స్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆరోగ్యశాఖ, RTC అధికారుల ప్రణాళికలు, సమన్వయంతో తిరునాళ్లు విజయవంతమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలు ఫలించి వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు వెల్లడించారు.
News February 16, 2026
నెల్లూరు జిల్లా ఉద్యోగులకు గుడ్ న్యూస్

నెల్లూరు జిల్లాలోని అన్ని శాఖల్లో అర్హత కలిగిన వారందరికీ రానున్న నెల రోజుల్లో ప్రమోషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. పానల్ జాబితాలను తయారు చేయాలని సూచించారు. కొన్ని శాఖల్లో ఎప్పటినుంచో సర్వీస్‌లో ఉంటూ ప్రమోషన్ పొందని వారు ఇంకా ఉన్నారని చెప్పారు. క్రిమినల్, శాఖా పరమైన కేసులు లేని వారందరికీ ప్రమోషన్ ఇవ్వాలని సూచించారు.


