News December 12, 2025
విశాఖలో సత్వా వాంటెజ్ సంస్థకు శంకుస్థాపన

దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కన్సల్టింగ్ సంస్థ అయిన సత్వా వాంటెజ్ క్యాంపస్‌ను ఐటీ శాఖ మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రూ.1500 కోట్ల పెట్టుబడితో 3 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ క్యాంపస్‌లో 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, పరోక్షంగా 50 వేల మంది వరకు ఉపాధి పొందుతారని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
Similar News
News April 5, 2026
విశాఖ: ఇంటింటికీ మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్

విశాఖలో జీవీఎంసీ మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్ రోజుకు సుమారు 50 నీటి పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది జనవరి 1న ప్రారంభమైన ఈ ల్యాబ్ రాష్ట్రంలో తొలి మొబైల్ సదుపాయం. రూ.40 లక్షలతో ఏర్పాటైన ఈ వాహనం 98 వార్డుల్లో తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి నీటి నాణ్యతను పరీక్షిస్తోంది. పీహెచ్, క్లోరిన్, టీడీఎస్, టర్బిడిటీ వంటి ప్రమాణాలను వెంటనే నిర్ధారిస్తున్నారు. ఇప్పటివరకు కాలుష్యం గుర్తించలేదని అధికారులు తెలిపారు.
News April 4, 2026
విశాఖలో పర్యటించనున్న కేంద్ర సమాచార కమిషనర్ సుధారాణి

సమాచార కమిషనర్ సుధారాణి రేలంగి ఈనెల 6, 7వ తేదీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. 6న ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకోనున్నారు. 7న ఉదయం 10 గంటలకు DSNLUలో జరిగే దక్షిణ ప్రాంత లా రివ్యూ కన్సల్టేషన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పర్యటనకు అధికారులు భద్రత, రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు.