News March 20, 2025
విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు: మంత్రి దుర్గేశ్

విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి త్వరలో కొత్త పాలసీ తీసుకురాబోతున్నట్టు చెప్పారు. సినీ ప్రముఖులతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. విశాఖపట్నంలో సినీపరిశ్రమ అభివృద్ది, గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధిపై మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
Similar News
News February 17, 2026
ఈనెల 21న విశాఖ జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు

విశాఖ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన ఈనెల 21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి 1 నుండి 7 వరకు గల స్థాయీ సంఘాల సమావేశాలు వేర్వేరు సమయాల్లో నిర్వహిస్తామని సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు సంబంధిత శాఖల అధికారులు ప్రగతి నివేదికలతో ఈ సమావేశాలకు హాజరుకావాలని ఆయన కోరారు.
News February 16, 2026
అంతర్జాతీయ కార్యక్రమాల భద్రతపై సీపీ సమీక్ష

విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఐఎఫ్ఆర్, మిలాన్ వేడుకల భద్రతా ఏర్పాట్లపై సీపీ డా.శంఖబ్రత బాగ్చి ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. విదేశీ ప్రతినిధులు, VVIPల భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై కీలక ఆదేశాలిచ్చారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు, డ్రోన్ నిఘా, CCTV మానిటరింగ్‌తో పాటు చిన్నారుల రక్షణకు RFID సాంకేతికతను వినియోగించాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు.
News February 16, 2026
విశాఖలో గవర్నర్‌కు ఘన స్వాగతం

విశాఖలో జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సోమవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, నగర పోలీసు కమిషనర్ సంఖ బ్రత బాగ్జీ, నౌకాదళ అధికారులు ఘన స్వాగతం పలికారు.


