News October 11, 2025

విశాఖలో సిఫీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

image

మంత్రి నారా లోకేశ్ రేపు విశాఖ రానున్నారు. ఉదయం 9 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి రుషికొండకు వెళ్తారు. SIFY డేటా సెంటర్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడ నుంచి ఎన్‌టీఆర్ భవన్‌కు చేరుకొని ముఖ్య నేతలతో సమిక్షిస్తారు. సాయంత్రం మూడు గంటలకు మధురవాడ స్టేడియంకు వెళ్లి క్రికెట్ మ్యాచ్‌ను విక్షిస్తారు. రాత్రి 11:40కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని విజయవాడ వెళ్తారు.

Similar News

News October 11, 2025

వీఎంఆర్డీఏ కమిషనర్ బదిలీపై చర్చ!

image

VMRDA 2047 మాస్టర్ ప్లాన్‌‌‌తో విశాఖ నగర విస్తృత అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుతోంది. ఈ తరుణంలో రెవెన్యూ అంశాలపై మంచి పట్టున్న VMRDA కమిషనర్ విశ్వనాథన్ బదిలీపై చర్చ నడుస్తోంది. అధికార వర్గాల నుంచి వస్తున్న వినతులు, అభ్యంతరాలను కమిషనర్‌ సీరియస్‌గా తీసుకోకపోవడం, ముక్కుసూటితనంగా ఉండటంతో ఆయనను బదిలీ చేయించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా అమరావతిలో I&PR డైరెక్టర్‌గా ఆయన బదిలీ అయ్యారు.

News October 11, 2025

అడవి పందులను చంపి తినేందుకు అనుమతివ్వాలి: కేరళ మంత్రి

image

అడవి పందుల బెడదతో పంట పొలాలు నాశనమవుతున్నాయని కేరళ వ్యవసాయశాఖ మంత్రి ప్రసాద్ అన్నారు. వాటిని చంపి తినేందుకు అనుమతిస్తే సమస్య తగ్గే అవకాశం ఉందని అలప్పుజలో జరిగిన ఓ కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత చట్టం దానిని అనుమతించట్లేదని గుర్తు చేశారు. అడవి పందులు అంతరించిపోతున్న జాతి కాదని పేర్కొన్నారు. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్-1972 ప్రకారం వన్యప్రాణుల వేట చట్టవిరుద్ధం.

News October 11, 2025

కిశోరి బాలికల కోసం “కిశోరి వికాసం 2.0..!

image

బాపట్ల జిల్లాలో కిశోరి బాలికల కోసం “కిశోరి వికాసం 2.0” ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో కిశోరి బాలికల పూర్తి సాధికారత కోసం నాణ్యమైన విద్య, సంపూర్ణ ఆహార ఆరోగ్యం, లింగ సమానత్వం, నైపుణ్యాభివృద్ధి, బాల్య వివాహాలను అరికట్టుట, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, మానవ అక్రమ రవాణా, ఆత్మ రక్షణ వంటి 12 కీలక అంశాల్లో అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.