News August 31, 2025

విశాఖలో సీఎం పర్యటన.. ఏర్పట్లు పరిశీలించిన జేసీ, సీపీ

image

సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 2న విశాఖలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, సీపీ శంఖ‌బ్ర‌త బాగ్చీ ఆదివారం పరిశీలించారు. కోస్టల్ బ్యాటరీ వద్ద గల హెలిపాడ్‌ను చెక్ చేసి అక్కడ చేపట్టవలసిన పనులపై చర్చించారు. అనంతరం నోవాటెల్ వద్ద ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అజిత, ఆర్డీవో శ్రీలేఖ పాల్గొన్నారు.

Similar News

News September 1, 2025

విశాఖలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

విశాఖపట్నం కలెక్టరేట్‌లో సోమవారం (సెప్టెంబర్ 01, 2025) ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదే విధంగా, సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

News August 31, 2025

విశాఖ: భవనం పైనుంచి జారిపడి మహిళ మృతి

image

పెద్ద రుషికొండలో భవనం పైనుంచి జారిపడి మృతి చెందింది. ఆరిలోవ ఉంటున్న చందక సత్యాలు (48) భవన నిర్మాణ కార్మికులరాలిగా పనిచేస్తోంది. ఆదివారం ఆదిత్య అపార్ట్‌మెంట్ వెనుక ఉన్న భవనంలో మరమ్మతుల పనులకు వెళ్లింది. అక్కడ పని చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి కిందపడడంతో మృతి చెందింది.

News August 31, 2025

విశాఖలో ఉత్తరాంధ్ర ప్రజా సంకల్ప వేదిక సమావేశం

image

ఉత్తరాంధ్ర ప్రజా సంకల్ప వేదిక విస్తృత స్థాయి సమావేశం ఆదివారం విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు మాదిరి రంగాసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంకల్ప వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలపై, రాజ్యాంగ హక్కులను కాపాడడం కోసం పనిచేస్తుందన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవచేస్తున్న 35 మంది ప్రతినిధులను సేవారత్న అవార్డులతో సత్కరించారు.