News August 25, 2025

విశాఖలో సెప్టెంబర్ 8 వ‌ర‌కు నేత్ర‌దాన ప‌క్షోత్స‌వాలు

image

ఆగ‌స్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 40వ జాతీయ నేత్ర దాన పక్షోత్సవాలు జ‌రుగుతాయ‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ తెలిపారు. ఈ మేర‌కు సోమ‌వారం క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. నేత్రదానంపై ప్ర‌తి ఒక్క‌రికీ అవగాహన క‌ల్పించాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్టర్ అధికారుల‌ను ఆదేశించారు. డీఎం & హెచ్వో జగదీశ్వరరావు, ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ ఉన్నారు.

Similar News

News August 26, 2025

విశాఖలో C.M. పర్యటన ఖరారు

image

C.M.చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారైంది. 29న సీఎం విశాఖ రానున్నారు. ఉదయం 11.15కి విశాఖ నావెల్ కోస్టల్ బ్యాటరీకి చేరుకుంటారు. 11.45 నుంచి 12.45 వరకు నోవాటెల్‌లో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌కి హాజరవుతారు. 1.15 నుంచి 3.45 వరకు రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో గ్రిఫిన్ ఫౌండేషన్ నెట్ వర్క్ మీటింగ్లో పాల్గొంటారు. సా. 4.20కి విశాఖ నుంచి బయలుదేరి వెళ్తారు.

News August 26, 2025

డీఎస్సీలో విశాఖ జిల్లా టాపర్‌గా శ్రావణి

image

మెగా డీఎస్సీ 2025లో మరడాన శ్రావణి 86 మార్కులతో(ఎస్ఏ) విశాఖ జిల్లా టాపర్‌గా నిలిచింది. జోన్-1మోడల్ స్కూల్ టీజీటీ ఇంగ్లీష్ 78 మార్కులతో 15వ ర్యాంకు సాధించి రెండు పోస్టులకు ఎంపికయింది. ఈమె ప్రాథమిక, ఉన్నత విద్య శ్రీహరిపురం, కళాశాల విద్య గాజువాకలోను అభ్యసించింది. గతంలో గ్రామ సచివాలయం ఉద్యోగం వచ్చినా వదులుకొని డీఎస్సీ‌కి ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించింది.

News August 26, 2025

అంకితభావం ఉన్న వారికే పదవులు: మంత్రి నిమ్మల

image

పార్టీ పట్ల అంకితభావం ఉన్నవారిని పార్టీ పదవులకు ఎంపిక చేస్తున్నామని మంత్రి రామానాయుడు చెప్పారు. మంగళవారం విశాఖలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ అధ్యక్షుల ఎంపిక జరుగుతుందన్నారు. వైఎస్ విజయమ్మను వైసీపీ గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తొలగించేందుకు ప్లీనరీ పెట్టుకున్నారని విమర్శించారు. T.D.P.లో అందరి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని పార్టీ పదవులకు ఎంపిక చేస్తామన్నారు.