News December 21, 2024

విశాఖలో సెలవు ఇవ్వకపోతే చర్యలు: DEO

image

వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలోని అన్ని స్కూళ్లకు శనివారం సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తప్పవని విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్ హెచ్చరించారు. మరోవైపు కొన్ని ప్రైవేట్ స్కూళ్లను ఓపెన్ చేశారని కొందరు అంటున్నారు. అనకాపల్లి జిల్లాకు ఈ సెలవు వర్తించదు. ఇంతకూ మీ ఏరియాలో స్కూళ్లకు సెలవు ఇచ్చారా? లేదా?

Similar News

News November 9, 2025

భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

ఈనెల 14,15వ తేదీల్లో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచస్థాయి భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లను క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదివారం పరిశీలించారు. ఏయూ ఇంజినీరింగ్ క‌ళాశాల‌ మైదానంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను జేసీ మ‌యూర్ అశోక్‌తో క‌లిసి ప‌రిశీలించి పలు సూచ‌న‌లు చేశారు. ప్ర‌తిష్ఠాత్మ‌క కార్య‌క్ర‌మానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజ‌ర‌వుతార‌న్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

News November 9, 2025

మల్కాపురంలో యువకుడి మృతి

image

మల్కాపురంలోని ఓ బార్‌లో పనిచేసే యువకుడు శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా మృతి చెందాడు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన గణపతి మల్కాపురంలోని బార్‌లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో అనారోగ్యానికి గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి బార్‌ వద్ద మృతి చెందినట్లు స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 8, 2025

విశాఖ: ‘బెదిరించి రూ.14 లక్షలు దోచేశారు’

image

59 ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసి మీ నంబర్‌పై కేసు నమోదైందని బెదిరించి రూ.14 లక్షలు దోచుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు విశాఖ CPని ఆశ్రయించారు. కేసు విచారణలో నిందితులుగా కృష్ణా జిల్లాకు చెందిన తారకేశ్వర్రావు, శివకృష్ణ, నాగరాజు, చందు, అబ్దుల్ కరీంగా గుర్తించారు. వీరు 350 నకిలీ సిమ్స్‌ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. నిందితులను శనివారం అరెస్ట్ చేశామన్నారు.