News March 2, 2025

విశాఖలో స్పా సెంటర్‌పై దాడి.. ఏడుగురి అరెస్ట్

image

విశాఖలోని సీతంపేట మార్గదర్శి ఆపోజిట్లో గల స్పా సెంటర్‌పై ద్వారక నగర్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా స్పా సెంటర్‌లో దాడులతో మిగతా స్పా సెంటర్‌లలో అలజడి నెలకొంది. ద్వారక నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 21, 2026

అభిషేక్ ఫామ్‌పై కెప్టెన్ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

image

T20WCలో ఆడిన 3 మ్యాచుల్లోనూ అభిషేక్ డకౌట్ కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కెప్టెన్ సూర్య స్పందించారు. అభి గురించి ఆందోళన పడుతున్నవారి గురించి తాను ఆందోళన పడుతున్నట్లు చమత్కరించారు. అతడిని ఎదుర్కోబోతున్న ప్రత్యర్థి జట్లపై మరింత ఆందోళనగా ఉందన్నారు. అభి బ్యాట్‌తో ఏం చేస్తాడో గతేడాది చూశామని, ప్రస్తుతం మద్దతుగా నిలవాల్సిన టైమ్ అని చెప్పారు. దీంతో రేపటి మ్యాచ్‌లో అభిషేక్ ఆడటం కన్ఫర్మ్ అయినట్లే.

News February 21, 2026

మహిళలకు నెలకు రూ.25,000.. క్లారిటీ

image

కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ స్కీమ్‌ను తీసుకొచ్చిందంటూ SMలో జరుగుతున్న ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇంటి దగ్గరే పనిచేస్తే రూ.25వేలు జీతం వస్తుందనేది అవాస్తవమని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను చూసి మోసపోవద్దని పౌరులకు సూచించింది. ఫేక్ న్యూస్, వీడియో, ఫొటో కనిపిస్తే factcheck@pib.gov.inకు పంపాలని కోరింది.

News February 21, 2026

స్వచ్ఛ కార్యక్రమంలో కాకినాడ జేసీ

image

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్ర దిశగా అడుగులేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పిలుపునిచ్చారు. 3వ శనివారం సందర్భంగా రూరల్ వాకలపూడిలో ఆయన అధికారులతో కలిసి చీపుర్లు చేత బట్టి డ్రైనేజీలను శుభ్రం చేశారు. ప్రజలతో స్వచ్ఛ ఆంధ్ర కోసం ప్రతిజ్ఞ చేయించారు. జేసీ తమ ఎదుట పరిసరాలు పరిశుభ్రం చేయడంతో ఉద్యోగులు, సిబ్బందే కాదు ప్రజలు కూడా భాగస్వాములయ్యారు.