News November 4, 2025

విశాఖలో 1.89 లక్షల కేజీల గోమాంసం సీజ్

image

విశాఖ శివారు ప్రాంతమైన ఆనందపురం మండలం మామిడిలోవ పంచాయతీలో భారీ మొత్తంలో గోమాంసాన్ని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా గోమాంసాన్ని ఎగుమతి చేస్తున్నారు. పూర్తి వివరాలతో ఓ వెటర్నరీ డాక్టర్ విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 1.89 లక్షల కేజీల గో మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

Similar News

News November 4, 2025

కూటమి ప్రభుత్వం రైతుల వెన్ను విరిచింది: జగన్

image

కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. రూ. 40 వేల పెట్టుబడి సాయం ఇవ్వాల్సింది పోయి, కేవలం రూ.5 వేలు ఇచ్చి రైతు వెన్ను విరిచారు అని వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ఉచిత ఇన్సూరెన్స్ ఉండేదని, ఇప్పుడు ఎరువులు కూడా బ్లాక్‌లో కొనే పరిస్థితి వచ్చిందని, రైతుల పరిస్థితి దారుణంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

News November 4, 2025

తిరుపతి: విధుల నుంచి ఇద్దరు టీచర్లు తొలగింపు

image

తిరుపతి జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులు 3 సంవత్సరాలుగా సమాచారం లేకుండా ఉద్యోగానికి రావడం లేదు. శ్రీకాళహస్తి మండలం ఓబులేలపల్లి ZP హైస్కూల్ వ్యాయమ ఉపాధ్యాయుడు ఏ.బాలకృష్ణ. రేణిగుంట మండలం గుండ్లకలువ MPPS SGT టీచర్ పి.దేవరాజును ఉద్యోగం నుంచి తొలగిస్తూ డీఈవో కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

News November 4, 2025

జిల్లాలో 64,160 పశువులకు వ్యాధినివారణ టీకాలు

image

జిల్లాలో 64160 పశువులకు గాలికుంటు వ్యాధినివారణ టీకాలు వేసినట్లు, దీంతో 14383 మంది రైతులు లబ్ధిపొందినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి కుమారస్వామి తెలిపారు. మంగళవారం పశువైద్యశాఖ డాక్టర్లు, సిబ్బందితో ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 14 వరకు టీకాల కార్యక్రమం సాగుతుందని, జిల్లాలో 132285 పశువులు ఉన్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారి కోరారు.