News June 4, 2024
విశాఖలో 5లక్షలు దాటిన శ్రీభరత్ మెజార్టీ

విశాఖ ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.శ్రీభరత్ 5,04,247 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. భరత్‌కి 9,07,467 ఓట్లు లభించాయి. వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి కేవలం 4,03,220 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారిటీగా నిలవనుంది. కూటమి అభ్యర్థిగా నిలిచిన శ్రీభరత్‌కు భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారు.
Similar News
News November 11, 2025
విశాఖ కలెక్టరేట్‌లో మైనారిటీ వెల్ఫేర్ డే

అబుల్ కలాం జయంతి పురస్కరించుకొని విశాఖ కలెక్టరేట్ లో జాతీయ విద్యా దినోత్సవం,మైనారిటీ వెల్ఫేర్ డే వేడుకలు మంగళవారం నిర్వహించారు.కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అబుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆయన మాట్లాడుతూ ఆనందపురంలో పీకేరు గ్రామంలో నాలుగు ఎకరాల భూమిలో ముస్లింలకు బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మైనారిటీ సొసైటీ భూములు 22ఏ నుంచి విడిపించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
News November 11, 2025
‘విశాఖ వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి’

CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్ల నేపథ్యంలో విశాఖ CP కార్యాలయంలో ఇన్‌ఛార్జ్ CP గోపినాథ్ జెట్టి సోమవారం పోలీస్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. సమ్మిట్ కోసం నగరానికి రానున్న దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, ప్రముఖల కోసం తీసుకోవలసిన భద్రత చర్యలపై పలు సూచనలు చేశారు. నగరంలోకి ప్రవేశించే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలన్నారు.ట్రాఫిక్ జామ్‌లు కాకుండా చూడాలన్నారు.
News November 11, 2025
విశాఖలో విషాద ఘటన

మద్యానికి బానిసైన కొడుకును కన్న తండ్రి హతమార్చిన ఘటన విశాలాక్షి నగర్లో చోటు చేసుకుంది. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 6వ తేదీన మద్యానికి డబ్బులు కావాలని వై.ప్రసాద్ (36) తండ్రి లక్ష్మణరావును వేధించాడు. కోపోద్రిక్తుడైన తండ్రి కొడుకు తలపై కర్రతో బలంగా కొట్టడంతో మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పాతిపెట్టాడు. మృతుని భార్య రాజీ ఫిర్యాదుతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


