News June 4, 2024

విశాఖలో 5లక్షల మెజారిటీ‌కి చేరువలో శ్రీభరత్

image

విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున లోక్‌సభకు పోటీ చేసిన ఎం.శ్రీభరత్ 5 లక్షల భారీ మెజారిటీకి చేరువులో ఉన్నారు. ఇప్పటివరకు ఆయన 8,93,613 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ 3,97,555 ఓట్లు సాధించారు. దీనితో ప్రస్తుతం భరత్ మెజారిటీ 4,96,058కి చేరింది. మరి కొద్దిసేపట్లో ఐదు లక్షల మెజారిటీని శ్రీభరత్ చేరుకోనున్నారు.

Similar News

News December 19, 2025

ఏపీ ఈపీడీసీఎల్‌కు జాతీయస్థాయి అవార్డు

image

పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో నిర్వహించిన 47వ అఖిల భారత పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్–2025లో ‘భారతరత్న శ్రీ అటల్ బీహారీ వాజపేయి జాతీయ అవార్డు’ను ఏపీఈపీడీసీఎల్ సాధించింది. 23 వేల గిరిజన కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందించిన సేవలకు ఈ గుర్తింపు లభించిందని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు.

News December 18, 2025

కేజీహెచ్‌లో చిన్నారికి అరుదైన వెన్నెముక శస్త్రచికిత్స

image

అనకాపల్లి జిల్లాకు చెందిన 9 ఏళ్ల తేజస్విని అనే చిన్నారికి విశాఖ కేజీహెచ్ వైద్యులు క్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. టీబీ కారణంగా తీవ్ర మెడనొప్పితో బాధపడుతున్న ఆమెకు సుమారు రూ.4 లక్షల విలువైన ఈ చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా అందించారు. న్యూరో సర్జరీ విభాగాధిపతి డా. ప్రేమ్ జిత్ రే బృందం చేసిన ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యిందని సుప్రెండెంట్ వాణి తెలిపారు.

News December 18, 2025

విశాఖ: సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటుకు పరిశీలన చేసిన కమిషనర్

image

నగరంలోని ముడసర్లోవ, రాడిసన్ బ్లూ హోటల్, సాగర్ నగర్ ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆయా ప్రాంతంల్లో పర్యటించి ట్రాక్ పనులపై జీవీఎంసీ ఈఈ, ఇతర అధికారులతో కమిషనర్ చర్చించి సూచనలు చేశారు. అలాగే బీచ్ రోడ్లో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు, మధురవాడలో ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు.