News January 21, 2026

విశాఖలో DSPCA సమావేశం

image

విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి అధ్యక్షతన జిల్లా జంతు క్రూరత్వ నివారణ కమిటీ (DSPCA) సమావేశం జరిగింది. వీధి కుక్కల నియంత్రణకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు (ABC), సింహాచలం దేవస్థాన కోడెల సంరక్షణపై సమీక్షించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జంతువుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను జేసీ ఆదేశించారు.

Similar News

News March 11, 2026

మధురవాడ జోన్‌లో అక్రమ నిర్మాణాలపై ఏసీబీ అధికారుల ఆరా

image

మధురవాడ జోన్ ప్రణాళిక విభాగంలో ఏసీబీ అధికారుల తనిఖీలు బుధవారం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిన్నటి దాడుల్లో స్వాధీనం చేసుకున్న దస్త్రాల ఆధారంగా క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనలు, ఆమోదించిన ప్లాన్‌లకు భిన్నంగా ఉన్న నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News March 11, 2026

విశాఖ: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విశాఖలో మంగళవారం సాయంత్రం జరిగింది. గోస్తాని గేటు ప్రధాన రహదారి పక్కన హై వోల్టేజ్ స్తంభం ఎక్కిన వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు హార్బర్ పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి హై వోల్టేజ్ స్తంభం ఎక్కుతుండగా నేవీ సిబ్బంది గమనించి దిగిపోమని హెచ్చరించినప్పటికీ మరింత మీదకు వెళ్లడంతో వైర్లు తగిలి ప్రమాదానికి గురైనట్లు చెప్పారు.

News March 11, 2026

విశాఖలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం..

image

విశాఖలోని భవన నిర్మాణ అనుమతులు, BPS, లేఅవుట్ల క్రమబద్ధీకరణలో అవినీతి ఆరోపణలపై ACB దర్యాప్తు ముమ్మరం చేసింది. మధురవాడ, పెందుర్తి, గాజువాక జోన్ల పరిధిలో ఫిర్యాదులు అందడంతో మంగళవారం సోదాలు నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. గడువు తర్వాత నిర్మించిన భవనాలు, నిర్మాణంలో ఉన్న వాటికి క్రమబద్ధీకరణ దరఖాస్తులు చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై నేడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు.