News March 24, 2025
విశాఖలో IPL మ్యాచ్.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు మ.2 నుంచి రాత్రి 12 గంటల వరకు మధురవాడ స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకుండా సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా దారి మళ్లించారు.
Similar News
News March 26, 2025
విశాఖ సీపీ సూచన.. సీఎం చంద్రబాబు ఆదేశాలు..!

రాష్ట్రంలో డీ అడిక్షన్ సెంటర్లు పెంచాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశంలో సూచించారు. ఒక్కో డ్రగ్‌కు ఒక్కో విధమైన ట్రీట్‌మెంట్ ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయాలని ఆదేశించారు. ఏ ప్రాంతంలో ఏ డ్రగ్ ఎక్కువగా వాడుతున్నారో తెలుసుకుంటే అక్కడ డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేయొచ్చని అధికారులకు సూచించారు.
News March 26, 2025
విశాఖ ఉక్కులో మోగనున్న సమ్మె సైరన్

విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ నెల 28న ఒక్క రోజు సమ్మెకి కాంట్రాక్ట్ కార్మికుల సంఘాలు పిలుపునిచ్చాయి. సంబంధిత కరపత్రాలను గేటు వద్ద మంగళవారం పంపిణీ చేశారు. కార్మికుల తొలగింపునకు నిరసనగా అఖిలపక్ష కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ఉక్కు యాజమాన్యం కార్మికులకు మెడికల్ టెస్టుల పేరుతో తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయని, ఈ సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు.
News March 25, 2025
విశాఖలో 50% వడ్డీ పై రాయితీ: కలెక్టర్

జీవీఎంసీ పరిధిలో గృహ యజమానులు, ఆస్తిపన్ను చెల్లింపుదారులు మార్చి 31లోపు ఆస్తి పన్ను చెల్లిస్తే 50శాతం వడ్డీ పై రాయితీ మినహాయింపును పొందవచ్చని కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఎంఎన్ హరింధిర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నగర ప్రజలు సౌకర్యార్థం, ప్రతీ వార్డు సచివాలయంలో ఆస్తిపన్ను బకాయిలను చెల్లించవచ్చు అన్నారు. మార్చి 30 ఆదివారం కూడా జోనల్ కార్యాలయాల్లో కేంద్రాలు పనిచేస్తాయన్నారు.