News May 12, 2024

విశాఖ: అందుబాటులో ఎన్నికల పరిశీలకులు

image

ఎన్నికల పరిశీలకులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. సాధార‌ణ ప‌రిశీల‌కులు అమిత్ శ‌ర్మ (63003 10152), పోలీసు ప‌రిశీల‌కులు అమిత్ కుమార్ (63003 15841), వ్యయ ప‌రిశీల‌కులు రెంగ రాజ‌న్ (63003 01726), ఎస్.కోట‌, ప‌శ్చిమ‌, గాజువాక నియోజ‌క‌వ‌ర్గాల సాధార‌ణ‌ ప‌రిశీల‌కులు సీతారామ్ జాట్ (63003 20829), భీమిలి, తూర్పు, ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గాల వ్యయ ప‌రిశీల‌కులు సౌమ్య (63003 16752)గా తెలిపారు.

Similar News

News September 16, 2025

విశాఖ చేరుకున్న నిర్మలా సీతారామన్

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. రేపు పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఈనెల 22 నుంచి కొత్త జీఎస్టీ అమలు కానుంది. దీంతో అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కార్యక్రమంతో పాటు స్వస్థ్‌ నారీ-సశక్త్‌ పరివార్‌ అభియాన్‌లో ఆమె పాల్గొంటారు. సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.

News September 16, 2025

గోపాలపట్నంలో దారుణ హత్య

image

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లపువానిపాలెం 89వ వార్డులో దారుణం జరిగింది. అలమండ నితీశ్ (23) అనే వ్యక్తి భీశెట్టి పరదేశి (75)పై బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులను కూడా బెదిరించాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 16, 2025

ప్రజలకు విశాఖ సిటీ పోలీసుల హెచ్చరిక

image

విశాఖపట్నం సిటీ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. లోన్ యాప్స్ వలలో పడి అనేక మంది వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. డౌన్లోడ్ చేసిన వెంటనే వ్యక్తిగత సమాచారం దోచుకుని, ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని తెలిపారు. సైబర్ మోసాలకు గురవకుండా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి మోసాలు ఎదురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.